ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు మాత్రం థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రాబోతుంది. కొన్నిరోజుల క్రితం రిలీజ్ డేట్ ప్రకటించగా ఇప్పుడు ట్రైలర్ వదిలి స్టోరీ ఏంటనేది రివీల్ చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా లీడ్ రోల్ చేసిన హిందీ థ్రిల్లర్ మూవీ 'రిపోర్టింగ్ లైవ్'. అక్టోబర్ 09 అంటే వచ్చే శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నాజర్, దేవేన్ భోజానీ , శాశ్వత్ ఛటర్జీ లాంటి సీనియర్ నటీనటులు కీలక పాత్రలు చేశారు. ఇసుక మాఫియాలోని డార్క్ సీక్రెట్స్ గురించి ఇందులో చూపించబోతున్నారు.
రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే ఒక యంగ్ రిపోర్టర్ (పరిణీతి చోప్రా) తన అనుభవజ్ఞుడైన కెమెరామన్ (దేవేన్ భోజానీ)తో కలిసి ఒక డార్క్ నెట్‌వర్క్‌ని ఛేదించే క్రమంలో చట్టవిరుద్ధంగా సాగుతున్న ఇసుక మాఫియా రహస్యాలని వెలుగులోకి తీసుకొస్తుంది. ఆ కథని బయటపెట్టేకొద్దీ క్రూరమైన మాఫియా సామ్రాజ్యం నుంచి ఈమెకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడిందనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)


