breaking news
Thella Kagitham Movie
-
మూవీ రిలీజ్ తర్వాత మళ్లీ ట్రెండింగ్‌లో నక్షత్ర (ఫొటోలు)
-
అరడజను సినిమాలు.. అన్నీ నిరాశే!
ఈ వారం థియేటర్లలోకి అరడజనుకు పైగానే సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని చిత్రాలపై రిలీజ్‌కు ముందు మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలు, ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం సీన్ మారిపోయింది. ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల నుంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకోలేకపోయింది. దీంతో ఈ వారం బాక్సాఫీస్ బరిలోకి దిగిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ వారం కూడా నిరాశే మిగిలింది.ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజల్ నటించిన ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవరించాడు. ఆయన కొడుకు ఎస్. ఎస్. కార్తికేయ నిర్మించాడు. అందుకే ఈ చిత్రంపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రం ప్రీమియర్ షోల నుంచే నెగిటీవ్ టాక్ మూటగట్టుకొంది. అసలు కార్తికేయ ఈ చిత్రాన్ని ఎందుకు నిర్మించాలకున్నాడు? కొడుకు డెబ్యూ ఫిల్మ్‌ని రాజమౌళి ఇలా ప్లాన్ చేస్తాడా? అనే విమర్శలు వచ్చాయి.(చదవండి: డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ రివ్యూ)ఇంచుమించు ఇలాంటి కామెంట్సే ‘సిగ్మా’ చిత్రంపై వచ్చాయి. తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం కావడంతో ‘సిగ్మా’పై ముందే ఆసక్తి నెలకొంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాకు తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ వచ్చింది. తెలుగులోనే కాదు తమిళనాట కూడా పెద్దగా ఆడడం లేదు.(చదవండి: సిగ్మా మూవీ రివ్యూ)ఇక కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం డోరతీ ఈ వారమే తెలుగులో రిలీజ్ అయింది. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా..టికెట్స్ మాత్రం పెద్దగా తెగడం లేదు. ఇక ఈ వారం సినిమాల్లో గట్టిన ప్రమోషన్స్ చేసిన సినిమా ‘తెల్లకాగితం’. కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రానికి కూడా మిశ్రమ స్పందననే లభించింది. ప్రమోషన్స్‌లో చెప్పినంత గొప్పగా ఏమి లేదని..పలు పాత్ర చిత్రాలను గుర్తు చేస్తుదంటూ సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. అందుకే రెండో రోజు నుంచి ఈ సినిమా టికెట్స్ పెద్దగా తెగడం లేదు. (చదవండి: 'తెల్లకాగితం' మూవీ రివ్యూ)గ్రామీణ నేపథ్యంలో రూరల్ మాఫియా, లోకల్ గ్యాంగ్ వార్, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలతో తెరకెక్కిన ‘అనకాపల్లి’ కూడా ప్రేక్షకులను థియేటర్లకు పెద్ద సంఖ్యలో రప్పించలేకపోయింది. ఇదే వారంలో వచ్చిన మరో తెలుగు చిత్రం ‘తత్వం’. పెద్ద స్టార్లు లేకపోవడం, భారీ ప్రమోషన్లు లేకపోవడంతో ఈ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా జనాలకు పెద్దగా తెలియదు. ఇక కన్నడలో సూపర్ హిట్‌గా నిలిచిన పల్లెటూరి ప్రేమకథ ‘ప్రేమద ఊరలి’ మూవీ.. ‘ప్రేమనే ఊరిలో’పేరుతో తెలుగులో ఈ శుక్రవారం(అక్టోబర్ 2) రిలీజ్ అయింది. ఉన్నంతలో కొంతవరకు ఈ సినిమా కాస్త బెటర్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ప్రమోషన్స్ సరిగా చేయకపోవడంతో ఇలాంటి ఒక సినిమా వచ్చిందన్న విషయమే ఇప్పటికీ చాలా మందికి తెలియదు. మొత్తంగా చూస్తే.. ఈ వారం వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిల్చాయి. -
కొత్త తెలుగు సినిమాలు ఎలా ఉన్నాయి? కలెక్షన్స్ ఎంత?
ఈ వీకెండ్ చాలానే తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మించిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్', దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తీసిన 'సిగ్మా', రోషన్ 'తెల్లకాగితం'తోపాటు అనకాపల్లి, కీర్తి సురేశ్ 'డోరతి' తదితర మూవీస్ ఉన్నాయి. ఇంతకీ వీటికి ఎలా స్పందన వస్తోంది? కలెక్షన్స్ సంగతేంటి?రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మించిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' మూవీలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ హీరో. అయితే ప్రమోషన్ల గట్టిగా చేయడంతో అంచనాలు పెరిగిపోయాయి. కానీ వీటిని అందుకోవడంలో మూవీ, యావరేజ్ మార్క్ దగ్గరే ఆగిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. దీనికి తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.1.65 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఫహాద్ 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' సినిమా రివ్యూ)తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కొడుకు జేసన్ సంజయ్.. దర్శకుడిగా మారి తీసిన సినిమా 'సిగ్మా'. సందీప్ కిషన్ హీరో. దీనికి రిలీజ్‌కి ముందు మంచి హైప్ ఏర్పడింది. తీరా చూస్తే టైటిల్ ట్రెండీగా ఉన్నా కంటెంట్ పాతగా ఉందని టాక్ వినిపించింది. ఇకపోతే ఈ చిత్రానికి తొలిరోజు రూ.2.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.(ఇదీ చదవండి: జేసన్ సంజయ్ 'సిగ్మా' తెలుగు రివ్యూ)'కోర్ట్' ఫేమ్ హర్ష్ రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ ప్రేమకథా సినిమా 'తెల్లకాగితం'. గతంలో జరిగిన ఓ నిజజీవిత సంఘటన ఆధారంగా దీన్ని తీశారు. అయితే క్లైమాక్స్ బాగానే ఉన్నప్పటికీ మిగతాదంతా చల్తా చల్తా. ఇది డీసెంట్ మూవీ అని ప్రేక్షకులు తీర్పు ఇచ్చారు. దీనికి తొలిరోజు రూ.1.58 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు నిర్మాత అధికారికంగా ప్రకటించుకున్నారు.(ఇదీ చదవండి: 'తెల్లకాగితం' సినిమా రివ్యూ)కీర్తి సురేశ్ టైటిల్ రోల్ చేసిన సినిమా 'డోరతి'. గతవారం తమిళనాడులోని థియేటర్లలోకి వచ్చింది. ఈ వీకెండ్ తెలుగులో రిలీజైంది. స్వలింగ ప్రేమ అనే భిన్నమైన కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇదో డిఫరెంట్ మూవీ అని చూసిన చాలామంది మెచ్చుకుంటున్నారు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు ఎంతొచ్చాయనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ 'డోరతి' సినిమా రివ్యూ)ప్రముఖ నిర్మాత లగటపాటి శ్రీధర్ కొడుకు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన సినిమా 'అనకాపల్లి'. యాక్షన్ ప్రేమకథగా దీనిని తెరకెక్కించారు. అయితే ప్రెజెంటేషన్ పర్లేదనిపించిందని, కత్తి పట్టిన వాడు చివరికి కత్తిపోటుకే ఎలా బలవుతాడు? పిల్లలు చేసే తప్పులకు తల్లిదండ్రులు పడే వేదన ఎలా ఉంటుంది? ప్రేమకు, ఆకర్షణకు మధ్య ఉన్న తేడా ఏంటి? అనే అంశాలని ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. దీనికి కూడా తొలిరోజు వసూళ్లెంతనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: 'అనకాపల్లి' సినిమా రివ్యూ) -
స్వచ్ఛమైన ప్రేమకథ అనిపించింది: ‘దిల్’ రాజు
‘‘నిర్మాత కృష్ణగారు రైటర్ నందుతో నాకు ఈ ‘తెల్ల కాగితం’ కథ చెప్పినప్పుడే 2000 నేపథ్యంలో సాగే ఎంతో స్వచ్ఛమైన, అమాయకమైన ప్రేమకథగా అనిపించింది. మా ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో ఎలాంటి అమాయకత్వంతో కూడిన ప్రేమకథ ఉందో... ఇందులోనూ అలాంటి ఫీల్ కనిపించింది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు తెలిపారు. హర్ష్ రోషన్ , నక్షత్ర జంటగా నటించిన చిత్రం ‘తెల్ల కాగితం’. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్ పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ‘దిల్’ రాజు, దర్శకులు అనిల్ రావిపూడి, కొరటాల శివ, చందు మొండేటి, వశిష్ట, శైలేష్ కొలను, రామ్ జగదీష్ అతిథులుగా హాజరయ్యారు. రమేష్ బండ్రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా అమ్మకి చెప్పినట్లే, ఆమెతో పాటు నా కుటుంబం, స్నేహితులు గర్వపడేలాంటి ‘తెల్ల కాగితం’ సినిమా తీశాను’’ అని పేర్కొన్నారు. -
'తెల్ల కాగితం' ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
షాకింగ్.. రిలీజ్‌కి మూడు రోజుల ముందే సినిమా మొత్తం లీక్!
ఒకవైపు పైరసీ భూతం.. మరోవైపు లీకేజీల బెడద.. చిత్ర పరిశ్రమను తరచూ వెంటాడుతున్న సమస్య ఇది. కోట్లు ఖర్చు పెట్టి, వందలాది మంది నెలల తరబడి కష్టపడి తెరకెక్కించిన సినిమా.. ప్రేక్షకుల ముందుకు రాకముందే బయటకు వచ్చేస్తుండటంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. తాజాగా చిన్న చిత్రం ‘తెల్లకాగితం’ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. విడుదలకు మూడు రోజుల ముందే లీక్ కావడంతో చిత్రబృందం ఆందోళనలో పడింది.కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ ‘తెల్లకాగితం’పై మొదటి నుంచీ మంచి బజ్ ఉంది. ఈ సినిమాను ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురు దర్శకులు, నిర్మాతలకు ప్రత్యేకంగా చూపించినట్లు తెలుస్తోంది. సినిమా చూసిన వారంతా పాజిటివ్‌గా స్పందించడంతో పాటు.. బిజినెస్ పరంగానూ ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో అక్టోబర్ 2న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై చిత్రబృందం ఎన్నో ఆశలు పెట్టుకుంది.అయితే సోమవారం అర్థరాత్రి అనూహ్యంగా సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మొదట ఒకట్రెండు సీన్లే బయటకు వచ్చాయని భావించినా.. లీకైనవి సాధారణ సన్నివేశాలు కాకపోవడం చిత్రబృందాన్ని మరింత కలవరపెట్టింది. సినిమాలో కీలకంగా నిలిచే ఎపిసోడ్లకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో.. అసలు సినిమా మొత్తం లీక్ అయిందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.లీకైన కంటెంట్‌కు సంబంధించిన లింకులను గుర్తించి, వాటిని తొలగించేందుకు చిత్రబృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్న వీడియోలు, లింకులపై చర్యలు తీసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో లీకైన ‘తెల్లకాగితం’ కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని, సినిమా అనుభూతిని థియేటర్లలోనే ఆస్వాదించాలని చిత్రబృందం ప్రేక్షకులను కోరింది. కష్టపడి తెరకెక్కించిన సినిమాను ఇలా విడుదలకు ముందే లీక్ చేయడం వల్ల నిర్మాతలు, చిత్రబృందం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.ఇప్పటికే పలు పెద్ద సినిమాలు సైతం పైరసీ, లీకేజీల బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా చిన్న చిత్రం ‘తెల్లకాగితం’కు ఎదురైన ఈ పరిణామం.. రిలీజ్‌కు ముందు కంటెంట్ భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.A heartfelt request to our audience. 🙏Please don’t download, share, or circulate any leaked content from #Thellakaagitham.Support the team by experiencing the film only in theatres. ❤️ pic.twitter.com/ticOg96e0o— Vamsi Kaka (@vamsikaka) September 29, 2026


