కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్-2026లో లీడర్‌షిప్ ఇన్ సినిమా అవార్డుకు ఎంపికయ్యారు. ఆస్ట్రేలియాలో జరగనున్న ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. వచ్చే నెల 13న ఈ అవార్డ్ స్వీకరించనున్నారు. ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల రిషబ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డుకు ఎంపికకావడం ఎంతో గర్వంగా ఉందన్నారు.
కాంతారా మూవీతో పాన్ ఇండియాలో క్రేజ్ తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి. కాంతార ప్రీక్వెల్‌తోనూ ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం రిషబ్ శెట్టి టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కలిసి పని చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్‌లో రిషబ్ నటిస్తున్నారు. ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో రిషబ్ కనిపించనున్నారు.


