∙బాలీవుడ్‌లో సీక్వెల్స్ చేస్తున్న స్టార్ హీరోలు
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీస్‌లో ఫ్రాంచైజీ సినిమాలు రూపొందుతున్నాయి. కానీ ఈ ట్రెండ్ బాలీవుడ్‌లో కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు ఈ ఫ్రాంచైజీ సినిమాల సీక్వెల్స్‌తో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం సీక్వెల్ సినిమాలు చేస్తున్న బాలీవుడ్ సీక్వెల్ స్టార్స్ ఎవరు? ఆ సినిమాల ప్రజెంట్ స్టేటస్ ఏంటి? అనే అంశాలపై ఓ లుక్ వేయండి..
ముగ్గురు కాదు... నలుగురు ఇడియట్స్
హిందీ చిత్రం ‘త్రీ ఇడియట్స్’ ఎంతటి బ్లాక్‌బస్టర్ విజయం సాధించిందో తెలిసిందే. ఆమిర్ ఖాన్ హీరోగా ఆర్. మాధవన్, శర్మాన్ జోషి కీలక పాత్రల్లో రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో రూపొందిన సెటైరికల్ కామెడీ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ‘త్రీ ఇడియట్స్’. విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమా 2009లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని ఇటీవల ఆమిర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అధికారికంగా ప్రకటించారు. ‘త్రీ ఇడియట్స్’ సినిమా కథ సిద్ధమైందని, రాజ్‌కుమార్ హిరాణి ప్రజెంట్ స్క్రీన్ ప్లే కోసం వర్క్ చేస్తున్నారని, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయిన తర్వాత ఈ సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్తామని ఆమిర్ ఖాన్ తెలిపారు.
అలాగే ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో ఉన్న కామెడీ ఈ సినిమా సీక్వెల్‌లోనూ ఉంటుందని, ప్రధాన పాత్రధారులందరూ ఆల్మోస్ట్ ఉంటారని ఆమిర్ పేర్కొన్నారు. అలాగే ‘త్రీ ఇడియట్స్’ కథ ముగిసిన పది సంవత్సరాల తర్వాత నుంచి సీక్వెల్ కథ ప్రారంభం అవుతుందని ఆమిర్ తెలిపారు.
కాగా, ‘త్రీ ఇడియట్స్’ సినిమా సీక్వెల్‌కు ‘ఫోర్ ఇడియట్స్’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఈ సినిమాలోని నాలుగో ప్రధాన పాత్రధారిగా విక్కీ కౌశల్‌ను ఎంపిక చేసుకున్నారట మేకర్స్. రాజ్‌కుమార్ హిరాణి డైరెక్షన్‌లో వచ్చిన గత చిత్రాలు ‘సంజు, డంకీ’ల్లో విక్కీ కౌశల్ కీ రోల్స్ చేశారు. తాజాగా ‘ఫోర్ ఇడియట్స్’ సినిమాలోనూ విక్కీ కౌశల్ నటించనున్నారని, ఆల్రెడీ కథ వినిపించగా, విక్కీ ఈ సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారనే టాక్ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. 2027 చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
పఠాన్ మళ్లీ వస్తున్నాడు!
షారుక్ ఖాన్ కెరీర్‌లో రూ. 1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో ‘పఠాన్’ చిత్రం కూడా ఒకటి. షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, దీపికా పదుకోన్, జాన్ అబ్రహాం, డింపుల్ క΄ాడియా, అశుతోష్ రాణా ఇతర ప్రధాన ΄ాత్రల్లో నటించారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా 2023లో రిలీజై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో అప్పట్నుంచే ఈ సినిమా సీక్వెల్ గురించిన వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ‘పఠాన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘పఠాన్ 2’ రాబోతున్నట్లు షారుక్ ఖాన్ పరోక్షంగా పేర్కొన్నారు. ప్రస్తుతం దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తోనే ‘కింగ్’ సినిమా చేస్తున్నారు షారుక్. ఈ సినిమా పూర్తయిన తర్వాతనే ‘పఠాన్’ సినిమాను సెట్స్‌కు తీసుకుని వెళ్తారా? లేక మరో సినిమా తర్వాత, ‘పఠాన్ 2’ను టేకప్ చేస్తారా? అనేది చూడాలి.
త్రిపాత్రాభినయం?
బాలీవుడ్‌లో ‘క్రిష్’ ఫ్రాంచైజీ ఎంతటి సక్సెస్‌ఫుల్ సినిమానో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఫ్రాంచైజీ నుంచి ‘క్రిష్ 4’ సినిమా రాబోతోంది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే... ఈ చిత్రంతో తొలిసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టనున్నారు హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ సినిమాకు హృతిక్ రోషన్ దర్శకత్వం వహించనున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే స్క్రిప్ట్ విషయంలో మాత్రం ఆయన తండ్రి రాకేష్ రోషన్ పర్యవేక్షణ ఉంటుందట. ఇదిలా ఉంటే... హృతిక్ రోషన్ నటించిన గత చిత్రం ‘వార్ 2’ బాక్సాఫీస్ అంచనాలు తారుమారు అయ్యాయి. దీంతో ‘క్రిష్ 4’ సినిమా సెట్స్‌కు వెళ్లడానికి కొంత సమయం పట్టేలా ఉంది. మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే... ఈ ‘క్రిష్ 4’లో హృతిక్ రోషన్ త్రి΄ాత్రాభినయం చేయనున్నారట. ప్రియాంకా చో్ర΄ా మరో లీడ్ రోల్‌లో నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. 2006లో వచ్చిన ‘క్రిష్’, 2013లో వచ్చిన ‘క్రిష్ 3’ సినిమాల్లో ప్రియాంకా చో్ర΄ా భాగమయ్యారు. మరి... ‘క్రిష్ 4’లో ప్రియాంక నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌తో హృతిక్ రోషన్ ఓ సినిమా కమిట్ అయ్యారు. ఈ సినిమా చేసిన తర్వాత ‘క్రిష్ 4’ చిత్రాన్ని సెట్స్‌కు తీసుకుని వెళ్తారా? లేక, ముందే మెగాఫోన్ పడతారా? అనేది తెలియాల్సి ఉంది.
ఖల్ నాయక్ రిటర్న్స్
బలరామ్ భల్లు ప్రసాద్ అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ ‘ఖల్ నాయక్’ అంటే మాత్రం టక్కున గుర్తుకు వస్తారు సంజయ్ దత్. ఇప్పుడు ఈ ‘ఖల్ నాయక్’ ప్రస్తావన ఎందుకు అంటే... బలరామ్ భల్లుగా మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్నారు సంజయ్ దత్. అవును... మీరు ఊహించినది నిజమే. ‘ఖల్ నాయక్’ సినిమాకి సీక్వెల్ రానుంది. ఈ సీక్వెల్‌కు ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ఖల్ నాయక్’ సినిమాకు సుభాస్ ఘాయ్ దర్శకత్వం వహించగా, ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ చిత్రానికి మాత్రం మరో దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. ఆ దర్శకుడు ఎవరు? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సీక్వెల్ కి మాత్రం సుభాష్ ఘాయ్ దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారట అలాగే ‘ఖల్ నాయక్’ సినిమాలో లీడ్ రోల్స్ చేసిన జాకీ ష్రాఫ్, మాధురి దీక్షిత్ సీక్వెల్‌లో మాత్రం గెస్ట్ రోల్స్ చేయనున్నారని బాలీవుడ్ సమాచారం. జియో స్టూడియోస్, అక్షా కాంబోజ్, సంజయ్ దత్ నిర్మించనున్న ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ చిత్రం వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది.
కొత్త డాన్ ఎవరు?
బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై డాన్స్ అంటే అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్‌లు గుర్తొస్తారు. 1978లో వచ్చిన ‘డాన్’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించగా, ఆ తర్వాత వచ్చిన ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006), ‘డాన్ 2’ (2011) చిత్రాల్లో షారుక్ ఖాన్ హీరోగా నటించారు. ఇవన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. కాగా ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006), ‘డాన్ 2 (2011)’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఫర్హాన్ అక్తర్ 2023లో ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు. రణ్‌వీర్ సింగ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా అధికారిక అనౌన్స్‌మెంట్స్ వచ్చింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్‌కు వెళ్లలేదు. ఈ సినిమా విషయంలో రణ్‌వీర్ సింగ్, ఫర్హాన్ అక్తర్‌ల మధ్య అభి్ర΄ాయభేదాలు వచ్చాయనే టాక్ బాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది. ఈ డిఫరెన్సెస్ సమసి΄ోయి, కొత్త డాన్‌గా రణ్‌వీర్‌సింగ్‌నే నటిస్తారా? లేక ఈ ప్లేస్‌ను మరో హీరో భర్తీ చేస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. కాస్త ఆలస్యమైనా ‘డాన్ 3’ సినిమా ఉంటుందని, ఇటీవల ఓ సందర్భంలో ఫర్హాన్ అక్తర్ పేర్కొన్నారన్న వార్తలు ఉన్నాయి.
ట్రెండీ లవ్‌స్టోరీ
‘కాక్‌టెయిల్’ సీక్వెల్ ‘కాక్‌టెయిల్ 2’ సిద్ధమైంది. ‘కాక్‌టెయిల్’ సినిమాకు దర్శకత్వం వహించిన హోమి అడజానియానే, ‘కాక్ టెయిల్ 2’ సినిమాకూ దర్శకత్వం వహించారు. కానీ నటీనటులు మారారు. సైఫ్ అలీఖాన్, దీపికా పదుకోన్, డయానా పెంటీ ‘కాక్‌టెయిల్’ సినిమాలో లీడ్ రోల్స్ చేయగా, సీక్వెల్‌లో మాత్రం షాహిద్ కపూర్, రష్మికా మందన్నా, కృతీ సనన్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. మోడ్రన్ లైఫ్‌స్టైల్, ట్రెండీ లవ్ రిలేషన్‌షిప్స్, యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ సమాచారం. ‘కాక్‌టెయిల్ 2’ సినిమా మేజర్ షూటింగ్‌ను విదేశాల్లో చేశారు. ఇటలీలో ఎక్కవ చిత్రీకణ జరగింది. దినేష్ విజన్, లవ్‌రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ కానుంది.
ప్రేమ... పెళ్లి... వినోదం
వైవాహిక జీవితం సాఫీగా సాగినంతవరకూ అంతా బాగానే ఉంటుంది. అనివార్యమైన సమస్యలు వచ్చినప్పుడు అప్పటివరకూ సంతోషంగా ఉన్న దంపతుల జీవితాలు ఎలాంటి ఇరుకుల్లో పడతాయి? అనే కథాంశంతో రూ΄÷ందిన చిత్రం ‘పతీ పత్నీ ఔర్ వో దో’. ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్, వామికా గబ్బి, రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. కార్తీక్ ఆర్యన్, అనన్య ΄ాండే, భూమి పెడ్నేకర్ నటించిన తొలి భాగం ‘పతీ పత్నీ ఔర్ వో’ (2019)కి దర్శకత్వం వహించిన ముదస్సర్ అజీజ్ సీక్వెల్‌ని కూడా తెరకెక్కించారు. నిజానికి 1978లో బీఆర్ చోప్రా దర్శకత్వంలో సంజీవ్ కుమార్, విద్యా సిన్హా, రంజితా కౌర్ ముఖ్య తారలుగా రూపొందిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘పతీ పత్నీ ఔర్ దో’కి ఈ తొలి భాగం రీమేక్. ఇక... తాజాగా రూపొందిన సీక్వెల్ మార్చి 4న విడుదల కావాల్సి ఉంది. అయితే నిర్మాణంలో కాస్త జాప్యం జరగడంతో వాయిదా వేశారు. ప్రేమ, పెళ్లి, వినోదం నేపథ్యంలో రూ΄÷ందిన ‘పతీ పత్నీ ఔర్ వో దో’ని ఫైనల్లీ మే 15న విడుదల చేయాలనుకుంటున్నారు.
సీక్వెల్ స్పెషలిస్ట్
బాలీవుడ్‌లో సీక్వెల్స్ అంటే అజయ్ దేవగన్ ప్రస్తావన ఉండకుండా ఉండదు. ఎందుకంటే... అజయ్‌దేవగన్ హీరోగా ఏదో ఒక సీక్వెల్ సినిమా సెట్స్‌పై ఉంటూనే ఉంటుంది. ‘సింగమ్, గోల్‌మాల్, ధమాల్, దృశ్యం’... ఈ నాలుగు ఫ్రాంచైజీ సినిమాల్లో అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్నారు. ‘సింగమ్’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన తాజా సినిమా ‘సింగమ్ ఎగైన్’ 2024లో రిలీజైంది. ప్రస్తుతం ‘గోల్ మాల్, దృశ్యం 3’ సినిమాలు సెట్స్‌పై ఉండగా, ‘ధమాల్ 4’ సినిమా జూలైలో రిలీజ్‌కు సిద్ధమైంది.
ఫుల్ నవ్వుల్‌తో నాలుగో ధమాల్
2007లో ఆరంభమైంది నవ్వుల ధమాల్. ఇప్పటివరకూ మూడు దఫాలుగా నవ్వుల ధమాల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు నాలుగోసారి ఫుల్ నవ్వుల్‌తో సిద్ధమైంది. ‘ధమాల్’ (2007) ఫస్ట్ పార్ట్‌ని స్వీయదర్శకత్వంలో రూపొందించారు ఇంద్రకుమార్. ఆ ఫస్ట్ పార్ట్‌లో సంజయ్ దత్, రితేష్, దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ, ఆశిష్ చౌదరి, జావేద్ జాఫ్రీ, సంజయ్ మిశ్రా తదితరులు నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘డబుల్ ధమాల్’ (2011)లోనూ సంజయ్ దత్, రితేష్, దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ, ఆశిష్ చౌదరి, జావేద్ జాఫ్రీ నటించారు.
అలాగే మల్లికా శెరావత్, కంగనా రనౌత్ వంటి తారలు కూడా సీక్వెల్‌లో యాడ్ అయ్యారు. ఈ చిత్రం కూడా ఇంద్రకుమార్ దర్శకత్వంలోనే రూ΄÷ంది, నవ్వులు పంచింది. ఆ తర్వాత ఇంకా నవ్విస్తా అంటూ మూడో భాగంగా ‘టోటల్ ధమాల్’ (2019)ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఇంద్రకుమార్. ఈ సీక్వెల్‌లోనూ రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ, జావేద్ జాఫ్రీ నటించారు. కానీ సంజయ్ దత్ నటించలేదు.
అజయ్ దేవగణ్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ మూడో భాగం తారాగణంలో యాడ్ అయ్యారు. ఈ సినిమాకి అజయ్ దేవగన్ ఓ నిర్మాత కూడా. ఇక ఇప్పుడు ‘ధమాల్ 4’ అంటూ నాలుగో ధమాల్ సిద్ధమైంది. జూలై 3న ఈ చిత్రం విడుదల కానుంది. సంజయ్ దత్, అజయ్ దేవగన్, మాధవన్, రితేష్ దేశ్‌ముఖ్, సంజయ్ మిశ్రా, జావేద్ జాఫ్రీ, రవి కిషన్ తదితరులు నటించారు. నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే ఈ ఫుల్ కామెడీ మూవీని కూడా ఇంద్రకుమారే తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని వాస్తవానికి మార్చిలో విడుదల చేయాలనుకున్నారు. అయితే రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ భారీ అంచనాల నడుమ విడుదలకు (మార్చి 19) సిద్ధమైన నేపథ్యంలో జూన్‌కి వాయిదా వేశారు. అయితే మరో భారీ సినిమా యశ్ ‘టాక్సిక్’ జూన్ 4న విడుదలకు సిద్ధం కావడంతో మరోసారి వాయిదా వేశారు. ఇప్పుడు ‘టాక్సిక్’ కూడా వాయిదా పడింది. ఫైనల్లీ ‘ధమాల్ 4’ని జూలై 3న రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు.
ఊటీలో గోల్‌మాల్
ప్రస్తుతం ‘గోల్‌మాల్ 5’ సినిమా చిత్రీకరణ కోసం అజయ్ దేవగన్ అండ్ గ్యాంగ్ ఊటీలో ఉన్నారు. రోహిత్ శెట్టి డైరెక్షన్‌లోని ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా, అర్షద్ వార్షి, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే, కునాల్ కేము ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ‘గోల్‌మాల్’ తొలి భాగంలో నటించిన శర్మాన్ జోషి, దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ‘గోల్‌మాల్ 5’లో భాగం అయ్యారు. ప్రస్తుతం ఊటీలో జరుగుతున్న షూటింగ్‌లో ΄ాల్గొంటున్నారు. వచ్చే ఏడాది ఈ ‘గోల్‌మాల్ 5’ సినిమా రిలీజ్ కానుంది.
అక్టోబరులో దృశ్యం 3
‘దృశ్యం’ అనగానే మనకు మలయాళంలో మోహన్‌లాల్ గుర్తొస్తారు. కానీ బాలీవుడ్ సినిమా లవర్స్‌కి అజయ్ దేవగన్ గుర్తుకు రావొచ్చు. ఎందుకంటే.. మలయాళ ‘దృశ్యం’ సినిమా ఫ్రాంచైజీ హిందీ రీమేక్స్‌లో అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్నారు. ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి. మూడో భాగాన్ని అధికారికంగా ప్రకటించి, ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 2న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అభిషేక్ ΄ాతక్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే హిందీ ‘దృశ్యం 2’లో నటించిన అక్షయ్ ఖన్నా ΄ాత్రలో మూడో భాగంలో జయదీప్ కనిపిస్తారట. టబు, శ్రియ శరణ్, రజత్ కపూర్ ఇతర ప్రధాన ΄ాత్రల్లో నటిస్తున్నారు. అన్నట్లు మరోమాట... మలయాళ ‘దృశ్యం 3’ సినిమా మే 21న రిలీజ్ కానుంది. తెలుగు ‘దృశ్యం 3’ మూవీలో వెంకటేశ్, మీనా నటిస్తారు. కానీ తెలుగు వెర్షన్ ఎప్పుడు సెట్స్‌కు వెళ్తుందనే విషయంపై క్లారిటీ రాలేదు.
ఇంకా హారర్ మూవీ ‘సైతాన్’కు సీక్వెల్‌గా ‘సైతాన్ 2’ సినిమా చేయనున్నట్లుగా అజయ్ దేవగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా వరుస సీక్వెల్ సినిమాలు చేస్తున్నారు కనుక అజయ్ దేవగన్‌ను సీక్వెల్ స్పెషలిస్ట్ అని సరదాగా చెప్పుకోవచ్చు.
ఈ చిత్రాలతో పాటు కంగనా రనౌత్ ‘క్వీన్ 2’, ‘తుంబాడ్ 2’ వంటి మరికొన్ని హిందీ చిత్రాల సీక్వెల్స్ సెట్స్‌కు వెళ్తున్నాయి. ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.


