జూ.ఎన్టీఆర్‌ తరహాలో రూమర్లపై బన్నీ వ్యవహరిస్తాడా? | Will Allu Arjun Break Silence On Political Entry Rumours Like Jr NTR? Fans Await Clarity As Speculations Continue | Sakshi
Sakshi News home page

జూ.ఎన్టీఆర్‌ తరహాలో రూమర్లపై బన్నీ వ్యవహరిస్తాడా?

Jul 16 2026 11:34 PM | Updated on Jul 17 2026 12:16 PM

Will Allu Arjun handle rumors the way Jr NTR does about Political Entry

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లోకి సినీ రంగానికి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు వస్తారనే ఊహాగానాలు ఇటీవల పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ రూమర్లు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఇక్కడ పొలిటికల్ ఎంట్రీ రూమర్లు ఎన్టీఆర్ పై రావడం కొత్తేం కాదు. ఇప్పటికే అతడిపై చాలా ఏళ్లుగా ఇలాంటి పుకార్లు వస్తూనే ఉన్నాయి. అయితే తన రాజకీయ ఎంట్రీపై వస్తున్న ప్రతి ఊహాగానాన్ని ఎన్టీఆర్ ఖండిస్తూ వచ్చాడు. తాజాగా వచ్చిన రూమర్లపై కూడా తన టీమ్‌ స్పందించింది. తాజాగా అల్లు అర్జున్ పై కూడా అలాంటి ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ఈ విషయంపై బన్నీ నుంచి ఎలాంటి స్పందన లేదు. తన టీమ్‌ నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. 

మొన్నటికిమొన్న తనపై వస్తున్న పొలిటికల్ ఎంట్రీ పుకార్లపై ఎన్టీఆర్ టీమ్ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చింది. ‘రా ఎన్టీఆర్’ అనే సంస్థతో కానీ అది చేసే పనులతో తారక్‌కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈనెల 18న ‘రా ఎన్టీఆర్’ చేయబోయే ఛారిటీతో కూడా ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ టీమ్ ప్రకటించింది. ఈ మద్య వచ్చిన రూమర్లలో ఎన్టీఆర్ కంటే ముందే బన్నీ పొలిటికల్ ఎంట్రీ అంటూ పుకార్లు వచ్చాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో అవి అలానే కొనసాగుతున్నాయి. మరోవైపు అతడిపై వస్తున్న ఊహాగానాలకు ప్రజల్లో చర్చ కూడా జరుగుతోంది.

ఇంత జరుగుతుంటే..అల్లు అర్జున్ మాత్రం తనపై వస్తున్న పుకార్లపై ఏమాత్రం స్పందించలేదు. ఆయన స్పందన కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ తన సినిమాల షూటింగ్ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. పుకార్లపై ఎన్టీఆర్ టీమ్ స్పష్టత ఇచ్చినప్పటికీ, అల్లు అర్జున్ నుంచి మాత్రం మౌనం కొనసాగుతుండటంతో ప్రజల్లో చర్చ మరింత పెరిగింది. ఆయన ఈ పుకార్లను ఓపెన్‌గా ఖండిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement