స్టార్ హీరో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్ | Saif Ali Khan Latest Movie Kartavya Trailer Out Now | Sakshi
Sakshi News home page

Kartavya Trailer: స్టార్ హీరో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్

May 7 2026 6:23 PM | Updated on May 7 2026 7:21 PM

Saif Ali Khan Latest Movie Kartavya Trailer Out Now

బాలీవుడ్‌ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ నటించిన లేటేస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కర్తవ్య. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి పుల్‌కిత్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో షారూఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు. తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఇవాళ ట్రైలర్ చూస్తుంటే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో సైఫ్‌ నిజాయితీ గల పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్‌లో క్రైమ్ సీన్స్ ఈ మూవీపై ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రం మే 15 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో రసిక, సంజయ్, సౌరభ్ కీలక పాత్రల్లో నటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement