కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడినా వెనక్కి తగ్గని రాహుల్‌ గాంధీ | Jitendra Singh spoke with Rahul Gandhi | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడినా వెనక్కి తగ్గని రాహుల్‌ గాంధీ

Jul 21 2026 5:46 PM | Updated on Jul 21 2026 7:43 PM

Jitendra Singh spoke with Rahul Gandhi

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద‍్ద కాంగ్రెస్ నిరసనకు దిగిన నేపథ్యంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్ కల్యాణ్ మార్గ్‌కు చేరుకుని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో మాట్లాడారు. కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా అక్కడ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు రాహుల్‌ గాంధీ పట్టుబడ్డారు.

నీట్‌ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని రాహుల్‌ గాం‍ధీ చెప్పారు. విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ జరిపించాలని రాహుల్‌ అన్నారు. ప్రధాని మోదీ మౌనం వీడాలని చెప్పారు. సమాధానం దాటవేసే ధోరణిలో మోదీ ఉన్నారు. విద‍్యార్థులపై దాడి.. దేశంపై దాడేనని చెప్పారు.

స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని కాంగ్రెస్‌ చెప్పింది. రాహుల్‌ గాంధీ డిమాండ్లపై కేంద్ర మంత్రి అమిత్‌ షాతో జితేంద్ర సింగ్‌ చర్చించారు. ఆందోళనలో పాల్గొనాలని ప్రజలకు రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం ముందు కాంగ్రెస్‌ పార్టీ 5 డిమాండ్లు  

  • ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే

  • నీట్‌ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలి

  • నీట్‌ పేపర్‌పై హోంమంత్రి సమాధానం చెప్పాలి

  • నీట్‌ పేపర్‌ లీక్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

  • ఆదివారం (జులై 20) జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ జరిపించాలి 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement