నల్లగొండ: తమ కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం సాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశానికి సంబంధించి పదే పదే తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది ఎవరి హయాంలో.. కూలింది ఎవరి హయాంలో అంటూ నిలదీశారు.
నల్లగొండ రివ్యూ మీటింగ్‌లో ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్ హయాంలో ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టును ప్రారంభించారు. తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు బీఅర్ఎస్ కక్కుర్తి కారణంగా మార్చారు. కమీషన్ల కోసమే మేడగడ్డకు మార్చారు. తుమ్మడిహెట్టి వద్ద నీళ్లు లేవనేది అబద్ధం. 30 శాతం ఖర్చు చేశాక మార్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంలో లోపం కారణంగానే కూలిపోయిందని జాతీయ స్థాయి నిపుణులే రిపోర్ట్ ఇచ్చారు’ అని స్పష్టం చేశారు.


