రాహుల్‌ గాంధీ, ప్రియాంక సహా కీలక నేతలు అరెస్ట్‌.. తీవ్ర ఉద్రిక్తత | Rahul Gandhi and congress leaders arrest | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీ, ప్రియాంక సహా కీలక నేతలు అరెస్ట్‌.. తీవ్ర ఉద్రిక్తత

Jul 21 2026 7:12 PM | Updated on Jul 22 2026 9:36 PM

 Rahul Gandhi and congress leaders arrest

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నివాసం దగ్గర మంగళవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ధర్నాకు దిగిన కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ సహా పలువురు ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు. భారీగా మోహరించిన పోలీసులు వారిని చుట్టుముట్టి బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల‌ని కాంగ్రెస్ డిమాండ్‌ చేసింది.

కేంద్రం ముందుకు కాంగ్రెస్ ఐదు డిమాండ్లు ఉంచింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలి, నీట్ పేపర్ లీక్ పై హోంమంత్రి సమాధానం చెప్పాలి, నీట్ పేపర్ లీక్ తో ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి, ఢిల్లీలో హింసపై విచారణ జరిపించాలి. ఈ ఐదు డిమాండ్లపై హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని చెప్పడంతో ఆయా నేతలందరినీ అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.  

రాహుల్‌ ముక్కులో నుంచి రక్తం?
రాహుల్‌ గాంధీని బలవంతంగా తరలించే సమయంలో ముక్కులో నుంచి రక్తం వచ్చిందని ఎన్డీటీవీ పేర్కొంది. పోలీసులు వచ్చిన సమయంలో రాహుల్ గాంధీ రోడ్డుపై కూర్చుని.. అక్కడి నుంచి వెళ్లేందుకు నిరాకరించగా, దాదాపు 10 మంది పోలీసు సిబ్బంది ఆయనను చుట్టుముట్టారు. చివరకు ఆయనను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన ముక్కు నుంచి రక్తం కారుతున్నట్టు కనిపించింది.

కాగా, కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచే ప్రయత్నంలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడి జరిగిన తదుపరిరోజే కాంగ్రెస్ నేతలు న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వైపు నిరసన చేపట్టడం గమనార్హం. రాహుల్ గాంధీ రాత్రంతా ప్రధాని నివాసం బయటే నిరసన కొనసాగిస్తారని సమాచారం వచ్చినా.. సాయంత్రం 6.40 గంటలకు పోలీసులు ప్రవేశించి ధర్నాను భగ్నం చేశారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement