అనన్య పాండే వింత డ్యాన్స్‌.. ట్రోలింగ్‌పై స్పందించిన చంకీ పాండే | Chunky Panday Respond On Ananya Panday Dance Video Trolling | Sakshi
Sakshi News home page

అనన్య పాండే ‘భరతనాట్యం’ పై ట్రోలింగ్‌.. స్పందించిన చంకీ పాండే

May 26 2026 7:38 PM | Updated on May 26 2026 8:10 PM

Chunky Panday Respond On Ananya Panday Dance Video Trolling

బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే డ్యాన్స్‌ వీడియో ఒకటి గత రెండు రోజులుగా నెట్టింట్‌ వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన కొత్త మూవీ ‘చాంద్ మేరా దిల్’సినిమాలోని వీడియో అది. అందులో అనన్య సంప్రదాయ దుస్తుల్లో నాట్యం చేస్తూ కనిపిస్తుంది. అయితే ఆ డ్యాన్స్‌ చూస్తే భరతనాట్యంలా అనిపించినప్పటికీ.. స్టెప్పులు మాత్రం ఇబ్బందికరంగా,వింతగా ఉండడంతో నెటిజన్స్‌ ఆమెను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. అలా స్టెప్పులేని భరతనాట్యాన్ని అవమానపరిచిందంటూ అనన్యపై ఫైర్‌ అవుతున్నారు.‘ట్రెడిషనల్‌ భరతనాట్యం వర్సెస్‌ బాలీవుడ్‌ నాట్యం’ అంటూ మీమ్స్‌ కూడా క్రియేట్‌ చేసి.. అనన్యను విమర్శిస్తూ కామెంట్స్‌ పెడుతున్నారు. 

తాజాగా ఈ ట్రోలింగ్‌ వీడియోపై అనన్య పాండే తండ్రి, ప్రముఖ నటుడు చంకీ పాండే స్పందించాడు. చిన్న క్లిప్పు చూసి జడ్జ్‌ చేయడం కరెక్ట్‌ కాదని, సినిమా చూసి అసలు విషయాన్ని అర్థం చేసుకున్నాక స్పందిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. సినిమాలో భరతనాట్యాన్ని ప్రదర్శించలేదని, అది కల్చరర్‌ ఈవెంట్లలో విద్యార్థులు ప్రదర్శించే ఫ్యూజన్‌ డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌ లాంటిదని చంకీ పాండే వివరణ ఇచ్చారు. చాలా మంది అపార్థం చేసుకొని తన కూతురిని విమర్శిస్తున్నారని ఆయన .పేర్కొన్నారు.

‘చాంద్ మేరా దిల్’ విషయానికొస్తే.. లక్ష్య్‌, అనన్య జంటగా నటించిన ఈ చిత్రానికి వివేక్‌ సోనీ దర్శకత్వం వహించారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాలేజీలోనే ప్రేమించుకున్న ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ షిప్ లోకి వెళ్ళాక వచ్చిన సమస్యలు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నారు? అనేది ఈ సినిమా కథ. హైదరాబాద్‌ నేపథ్యంలోనే కథనం సాగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement