కియా కొత్త కార్లు.. మార్కెట్‌లోకి టాప్‌ వేరియంట్లు | Kia Seltos New Top Variants Launch India GTX(O), X-Line(O) Price | Sakshi
Sakshi News home page

కియా కొత్త కార్లు.. మార్కెట్‌లోకి టాప్‌ వేరియంట్లు

Jul 1 2026 4:19 PM | Updated on Jul 1 2026 4:35 PM

Kia Seltos New Top Variants Launch India GTX(O), X-Line(O) Price

కియా ఇండియా (Kia India) తన పాపులర్‌ ఎస్‌యూవీ సెల్టోస్ లైనప్‌ను మరింత బలోపేతం చేస్తూ కొత్తగా జీటీఎక్స్‌(ఓ) (GTX(O)), ఎక్స్‌-లైన్‌(ఓ) (X-Line(O)) అనే టాప్ వేరియంట్లను భారత మార్కెట్లో విడుదల చేసింది.  కంపెనీ ప్రకటన ప్రకారం.. ఈ కొత్త వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 21.56 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. దీంతో, ఇప్పటివరకు టాప్‌లో ఉన్న GTX(A), X-Line(A) వేరియంట్ల స్థానాన్ని ఇవి భర్తీ చేశాయి.

సెల్టోస్ ప్రస్తుత బేస్ మోడల్ ధర రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద కొనసాగుతుండగా, కొత్త టాప్ వేరియంట్లు ప్రీమియం ఫీచర్లు, సేఫ్టీ టెక్నాలజీతో మరింత హైఎండ్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి.

ఈ కొత్త వేరియంట్లలో ప్రధాన ఆకర్షణగా ADAS Level 2 F+ సూట్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో మొత్తం 28 అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. జంక్షన్ క్రాస్ కొలిజన్ కంట్రోల్‌, లేన్ చేంజ్ అలర్ట్స్‌, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, హైవే డ్రైవింగ్ అసిస్ట్ వంటి సేఫ్టీ టెక్నాలజీలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఇవి డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా మార్చేలా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

ఫీచర్ల పరంగా కూడా ఈ వేరియంట్లు మరింత ప్రీమియంగా ఉన్నాయి. కనెక్టెడ్ కార్ నావిగేషన్ కాక్‌పిట్, ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్స్ సపోర్ట్, డిజిటల్ కీ, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), AQI డిస్‌ప్లే ఉన్న స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, అలాగే మొబైల్ యాప్ ద్వారా నియంత్రించగల ఫ్రంట్–రియర్ డాష్‌క్యామ్‌లు వంటి ఆధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా రైన్-సెన్సింగ్ వైపర్లు, వన్-టచ్ పవర్ విండోస్, కియా కనెక్ట్‌ 2.0 ద్వారా 85కు పైగా కనెక్టెడ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మార్కెట్లో ఈ అప్‌గ్రేడ్‌తో సెల్టోస్ పోటీ మరింత పెరిగింది. ఇది మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హ్యుందాయ్ క్రెటా, హోండా ఎలివేట్ వంటి ప్రముఖ మిడ్-సైజ్ ఎస్‌యూవీలతో నేరుగా పోటీ పడుతోంది.

ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, సెల్టోస్‌లో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (115 బిహెచ్‌పి), 1.5 లీటర్ డీజిల్ (116 బీహెచ్‌పీ), 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (160 బీహెచ్‌పీ) ఇంజిన్ ఆప్షన్లు కొనసాగుతున్నాయి. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో మాన్యువల్, సివిటి, ఆటోమేటిక్, iMT, 7-స్పీడ్ DCT వంటి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement