అందుకే.. ఏఐ ఎంత ఎదిగినా.. మనిషి అవసరమే! | For The First Time AI Boss Fires Human Employee At US Store | Sakshi
Sakshi News home page

అందుకే.. ఏఐ ఎంత ఎదిగినా.. మనిషి అవసరమే!

Aug 16 2026 6:44 PM | Updated on Aug 16 2026 7:01 PM

For The First Time AI Boss Fires Human Employee At US Store

శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆండన్ మార్కెట్‌ అనే ఎక్స్‌పెరిమెంటల్‌ స్టోర్‌ను ఏఐ మేనేజర్ లూనా నిర్వహిస్తోంది. ఆండన్ ల్యాబ్స్ కంపెనీ లూనాకు డబ్బు, కార్పొరేట్ కార్డు, ఇంటర్నెట్ సదుపాయం ఇచ్చి దుకాణాన్ని నడిపిస్తూ లాభం సంపాదించమని బాధ్యత అప్పగించింది.

లూనా తన విధి నిర్వహణలో భాగంగా దుకాణంలో ఏ వస్తువులు అమ్మాలి, వాటి ధరలు ఎంత ఉండాలి, దుకాణం ఎప్పుడు తెరవాలి వంటి అనేక నిర్ణయాలు తీసుకుంది. అయితే దుకాణం ఇప్పటివరకు లాభాల్లోకి రాలేదు. కానీ.. ఇటీవల లూనా ఒక మానవ ఉద్యోగిని తొలగించాలని సిఫారసు చేసింది. ఆ ఉద్యోగి 23 షిఫ్టుల్లో 17 సార్లు ఆలస్యంగా వచ్చాడు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హాజరుకు సంబంధించిన ఒక నియమాన్ని లూనా గతంలో తానే రూపొందించింది. కానీ.. ఆ నియమాన్ని తర్వాత గుర్తుంచుకోలేకపోవడంతో, ఉద్యోగి చాలా కాలం ఆలస్యంగా వచ్చినా చర్య తీసుకోలేదు. చివరకు మానవ సిబ్బంది లూనాకు తాను రూపొందించిన నియమాన్ని గుర్తు చేసి, ఉద్యోగి పనితీరును మళ్లీ పరిశీలించమని చెప్పడంతో ఉద్యోగిని తొలగించాలని సిఫారసు చేసింది.

ఈ సంఘటన ఏఐ ఎంత తెలివిగా ఉన్నప్పటికీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయని చూపించింది. ఒక నియమాన్ని స్వయంగా తయారు చేయడం మాత్రమే కాకుండా.. దాన్ని సరైన సమయంలో గుర్తుంచుకుని అమలు చేయడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉద్యోగులపై ప్రభావం చూపే నిర్ణయాల్లో ఏఐ ఒక్కదానిపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరం. అందుకే ఈ సందర్భంలో చివరి నిర్ణయాన్ని మానవులే అమలు చేశారు.

దీన్నిబట్టి చూస్తే.. ఏఐ వ్యాపారంలో అనేక పనులను నిర్వహించగలిగినా, మానవ పర్యవేక్షణ అవసరం ఇంకా ఉందని తెలుస్తోంది. లూనా తీసుకున్న ఈ తొలి ఉద్యోగ తొలగింపు నిర్ణయం ద్వారా ఏఐలో సామర్థ్యం ఉన్నప్పటికీ.. దాని నిర్ణయాలను సరైన విధంగా పర్యవేక్షించడానికి మనుషుల పాత్ర చాలా అవసరం అని స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement