వాడకుండా ఉన్న క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేస్తున్నారా? | Closing Credit Cards? RBI Rules And Hidden Mistakes That Can Hurt Your CIBIL Score, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

వాడకుండా ఉన్న క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేస్తున్నారా?

Jul 16 2026 2:54 PM | Updated on Jul 16 2026 3:34 PM

Closing Credit Cards Hidden RBI Rules That Can Crash Your CIBIL Score

ఈ రోజుల్లో ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం సాధారణం. వివిధ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లకు ఆకర్షితులై చాలామంది అవసరానికి మించి కార్డులు తీసుకుంటారు. అయితే, కొంతకాలం తర్వాత వాటిలో కొన్నింటిని అస్సలు వాడకుండా పక్కనపెట్టేస్తుంటారు. ‘ఎలాగూ వాడటం లేదు కదా, క్లోజ్ చేసేద్దాం’ అని అనుకుంటే.. ఒక్క నిమిషం ఆగండి! మీ నిర్ణయం వల్ల మీ క్రెడిట్ స్కోర్ పడిపోయే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించిన విషయాలు చూద్దాం.

మీ సిబిల్ స్కోర్‌ను దెబ్బతీసే ప్రధాన అంశాలు

మీకు ఉన్న మొత్తం క్రెడిట్ లిమిట్‌లో ఎంత శాతం వాడుతున్నారనేదే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (సీయూఆర్‌). ఇది ఎప్పుడూ 30 శాతం కంటే తక్కువగా ఉండాలి. ఒక కార్డును క్లోజ్ చేయడం వల్ల మీ మొత్తం అందుబాటులో ఉన్న క్రెడిట్ లిమిట్ తగ్గిపోతుంది. దీనివల్ల మీరు చేసే ఖర్చు మారకపోయినా మీ సీయూఆర్‌ శాతం ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇది మీ స్కోర్ పడిపోవడానికి ప్రధాన కారణమవుతుంది. బ్యాంకులు మీకు లోన్ ఇచ్చే ముందు మీరు ఎంత కాలంగా క్రెడిట్‌ను బాధ్యతాయుతంగా వాడుతున్నారనే హిస్టరీని చూస్తాయి. మీ దగ్గర ఉన్న కార్డులలో అత్యంత పాత కార్డును క్లోజ్ చేస్తే క్రెడిట్ హిస్టరీ సగటు డ్యూరేషన్‌ తగ్గిపోతుంది.

ఆర్‌బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

మీ క్రెడిట్ కార్డును వరుసగా 12 నెలల పాటు అసలు వాడకపోతే బ్యాంకులు ఆ కార్డును క్లోజ్ చేసే అధికారం కలిగి ఉంటాయి. అయితే, అలా చేసే ముందు ఖాతాదారునికి తప్పనిసరిగా నోటీసు ఇవ్వాలి. ఖాతాదారుడు అన్ని బకాయిలు చెల్లించి కార్డ్ క్లోజర్ కోసం దరఖాస్తు చేసుకున్న ఏడు పని దినాల్లో బ్యాంక్ ఆ ఖాతాను మూసివేయాలి. ఒకవేళ బ్యాంక్ గడువు దాటి ఆలస్యం చేస్తే ఆ తర్వాత ప్రతి రోజు ఆలస్యానికి రూ.500 చొప్పున బ్యాంకు సదరు కస్టమర్‌కు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

సురక్షితమైన కార్డ్ క్లోజర్ విధానం

  • కార్డుపై ఉన్న అవుట్‌స్టాండింగ్ బకాయిలు, ఈఎంఐలను పూర్తిగా క్లియర్ చేయండి.

  • ఖాతా మూసివేసే ముందే మీ రివార్డ్ పాయింట్లను పూర్తిగా వాడేసుకోండి.

  • ఓటీటీ, ఇన్సూరెన్స్ వంటి వాటికి ఇచ్చిన ఆటో డెబిట్ ఆప్షన్లను రద్దు చేయండి.

  • కార్డు విజయవంతంగా క్లోజ్ అయిన తర్వాత బ్యాంక్ నుంచి అధికారిక కన్ఫర్మేషన్ లేదా ‘నో డ్యూస్ సర్టిఫికేట్’ తప్పక తీసుకోండి.

ఒకవేళ మీరు క్లోజ్ చేయాలనుకుంటున్న కార్డుకు ఎలాంటి వార్షిక రుసుము లేకపోతే దానిని అలాగే ఉంచడం మంచిది. నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి చిన్న మొత్తంలో వాడుతూ యాక్టివ్‌గా ఉంచితే అది మీ క్రెడిట్ లిమిట్‌ను పెంచి తద్వారా మీ సిబిల్ స్కోర్‌ను మరింత పెంచడానికి సహాయపడుతుంది.

ఇదీ చదవండి: IRCTC వెబ్‌సైట్‌ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement