‘లక్షల రూపాయల ప్యాకేజీ ఉన్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రపంచాన్ని చుట్టేయడానికి బయలుదేరాను’ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా రీల్స్‌లో చాలా మంది ఇన్‌ఫ్యుయెన్సర్లు చెప్పడం చూశాం. స్థిరమైన కెరీర్‌ను వదులుకుంటేనే కలలను సాకారం చేసుకోగలమనే ఒక భ్రమను ఈ ధోరణి సృష్టిస్తోంది. అయితే, ఈ నెరేటివ్‌ను సవాలు చేస్తూ తన ఫుల్‌టైమ్ 9-5 జాజ్‌ను కాపాడుకుంటూనే ప్రపంచాన్ని చుట్టేస్తున్న పంజాబ్‌కు చెందిన లైఫ్‌స్టైల్, ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ ఆనీ శర్మ సరికొత్త పంథాతో వార్తల్లో నిలిచారు.
ఆనీ శర్మ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వివరాల ప్రకారం.. స్థిరమైన ఆదాయాన్ని, కెరీర్‌ను పణంగా పెట్టకుండానే ప్రయాణాల పట్ల ఉన్న అభిరుచిని ఎలా కొనసాగించవచ్చో నిరూపించారు. ఆమె అనుసరిస్తున్న వ్యూహాలు కొందరు వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ముందస్తు ప్రణాళిక: ప్రతి పర్యటనను కొన్ని నెలల ముందే పక్కాగా ప్లాన్ చేసుకోవడం, బడ్జెట్‌ను క్రమశిక్షణతో నిర్వహించడం వల్ల ఖర్చులు అదుపులో ఉంటాయి.
శాండ్‌విచ్ పద్ధతి: ఆమె సాధారణంగా 4-5 రోజుల చిన్న ట్రిప్స్ కాకుండా 10 రోజుల సుదీర్ఘ పర్యటనలను ఎంచుకుంటారు. రెండు వారాంతాలను కలుపుతూ మధ్యలో వచ్చే పనిదినాలను మేనేజ్ చేస్తారు.
రిమోట్ వర్క్ వినియోగం: ఆమెకు ఉన్న రిమోట్ వర్క్ సౌలభ్యం దీనికి ఎంతో ఉపయోగపడుతోంది. పర్యటనలో ఉన్నప్పుడు వారాంతాల్లో స్థానిక ప్రాంతాలను అన్వేషిస్తూ పనిదినాల్లో రిమోట్‌గా ఆఫీస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
అదనపు ఆదాయ వనరులు: ఉద్యోగ జీతంతో పాటు సోషల్ మీడియా కొలాబొరేషన్స్, బ్రాండ్ స్పాన్సర్‌షిప్స్ ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తూ ప్రయాణ ఖర్చులను సమతుల్యం చేసుకుంటున్నారు.
ఉద్యోగాలు వదిలేయండనే తోటివారి ఒత్తిడికు లోనుకావద్దని ఆనీ శర్మ హితవు పలికారు. రిమోట్ వర్క్ సంస్కృతిని, సమయాన్ని స్మార్ట్‌గా మేనేజ్ చేసుకుంటే కెరీర్ ఎదుగుదలను, వ్యక్తిగత సంతోషాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లవచ్చని ఆమె చెప్పారు.
ఇదీ చదవండి: IRCTC వెబ్‌సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు


