డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే? | Renault Duster Adventure Edition Launched In India | Sakshi
Sakshi News home page

డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే?

Jul 14 2026 9:03 PM | Updated on Jul 14 2026 9:03 PM

Renault Duster Adventure Edition Launched In India

రెనాల్ట్ ఇండియా.. డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ పేరుతో స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.12.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది స్టాండర్డ్ టెక్నో వేరియంట్ కంటే మెరుగ్గా ఉంటుందని తెలుస్తోంది. ప్రత్యేకమైన కాస్మెటిక్ అప్డేట్స్ కూడా పొందుతుంది.

డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి 1.0 టర్బో పెట్రోల్ మాన్యువల్ (రూ. 12.99 లక్షలు), 1.3 టర్బో పెట్రోల్ మాన్యువల్ (రూ.13.99 లక్షలు), 1.3 టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ (రూ. 15.39 లక్షలు).

డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ సాధారణ డస్టర్ మాదిరిగా అదే ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఫుల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి.

మెకానికల్‌గా.. ఈ స్పెషల్ ఎడిషన్ మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే ఇంజిన్ లేదా ట్రాన్స్‌మిషన్ స్పెసిఫికేషన్‌లలో ఎలాంటి మార్పులు లేదు. కాబట్టి కొనుగోలుదారులు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్, లేదా 1.3-లీటర్ టర్బో పెట్రోల్ వంటివి కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement