100 డాలర్లు పెరిగిన బంగారం ధర! | Gold Prices Surge 100 Dollars After US CPI Falls More Than Expected Peter Schiff Tweet | Sakshi
Sakshi News home page

100 డాలర్లు పెరిగిన బంగారం ధర!

Jul 14 2026 7:22 PM | Updated on Jul 14 2026 7:53 PM

Gold Prices Surge 100 Dollars After US CPI Falls More Than Expected Peter Schiff Tweet

అమెరికాలో జూన్ సీపీఐ.. అంచనాలకు మించి 0.4 శాతం తగ్గడంతో బంగారం ధర 100 డాలర్లు పెరిగిందని ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు పీటర్ డేవిడ్ షిఫ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.

బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం చమురు ధర 30 శాతం పడిపోవడమే అని షిఫ్ వెల్లడించారు. కానీ ప్రస్తుత పరిస్థితి మారుతోంది. జూలైలో చమురు ధరలు ఇప్పటికే సుమారు 20 శాతం పెరిగాయి. దీంతో భవిష్యత్తులో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా ద్రవ్యోల్బణం తగ్గితే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గితే.. బంగారం వంటి పెట్టుబడులకు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే బంగారం వడ్డీ ఆదాయం ఇవ్వదు కాబట్టి, తక్కువ వడ్డీ రేట్ల సమయంలో ఇది మరింత ఆకర్షణీయంగా మారుతుంది.

అయితే.. అధికారిక గణాంకాల్లో ద్రవ్యోల్బణం తగ్గినట్లు కనిపించినప్పటికీ.. ప్రజలు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఇంధనం, రవాణా, ఇతర అవసరాల ధరలు పెరిగితే దాని ప్రభావం సాధారణ ప్రజలపై ఉంటుంది.

జూన్ సీపీఐ తగ్గడం బంగారం ధరలకు తాత్కాలికంగా మద్దతు ఇచ్చింది. కానీ.. చమురు ధరల పెరుగుదల, వాస్తవ ద్రవ్యోల్బణ పరిస్థితులు, అమెరికా ఫెడ్ తీసుకునే నిర్ణయాలపై బంగారం భవిష్యత్ కదలికలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి, అధికారిక గణాంకాల కంటే ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న వాస్తవ మార్పులను కూడా గమనించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

భారతదేశంలో బంగారం ధరలు
ఇండియన్ మార్కెట్లో గోల్డ్ రేటు గత కొంత కాలంగా తగ్గుతూ ఉంది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు హైదరాబాద్, విజయవాడలలో రూ. 1,42,800 వద్ద ఉంది. గత నెలతో పోలిస్తే.. బంగారం ధర ఈ నెలలో కొంత తక్కువే అని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement