పెరిగిన బంగారం.. తగ్గిన వెండి: తాజా ధరల ఇలా.. | Gold Prices Rise Silver Falls Latest Rates Explained | Sakshi
Sakshi News home page

పెరిగిన బంగారం.. తగ్గిన వెండి: తాజా ధరల ఇలా..

Jul 18 2026 7:00 PM | Updated on Jul 18 2026 8:15 PM

Gold Prices Rise Silver Falls Latest Rates Explained

దేశంలో బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ ముందుకు దూసుకెళ్తున్నాయి. మొత్తం మీద వారం రోజుల్లో తులం గోల్డ్ రేటు గరిష్టంగా రూ.1,43,290 వద్దకు చేరింది. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరల్లో జరిగిన మార్పులు ఏమిటి?, ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.

జులై 12న హైదరాబాద్, విజవాడలలో రూ.రూ.1,44,330 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం రేటు జులై 18 నాటికి రూ.1,43,290 వద్దకు చేరింది. అంటే ఏడురోజుల్లో రూ.1040 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల రేటు 1,32,300 రూపాయల నుంచి రూ.1,31,350 వద్దకు (రూ. 950 పెరిగింది) చేరింది.

ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పులు జరిగాయి. ఇక్కడ వారం రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,480 నుంచి 1,43,440 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,32,450 నుంచి రూ.1,31,450 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే ఏడురోజుల్లో గోల్డ్ రేటులో ఎంత మార్పు జరిగిందో స్పష్టమవుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,090 నుంచి రూ.1,43,290 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,33,000 నుంచి 1,31,350 రూపాయలకు చేరింది. అంటే ఏడూ రోజుల్లో పసిడి ధరలు వరుసగా రూ.1800, రూ.1650 పెరిగింది.

వెండి ధరలు ఇలా
బంగారం ధరల్లో మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా గణనీయమైన మార్పు జరిగింది. జులై 12న రూ.2.40 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. జులై 18 నాటికి రూ.2.35 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో హైదరాబాద్‌లో వెండి రేటు రూ.5000 తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement