టిక్‌టాక్‌కు గ్రీన్ సిగ్నెల్.. మళ్లీ రీఎంట్రీ! | US Government Employees Now Allowed To Download TikTok | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌కు గ్రీన్ సిగ్నెల్.. మళ్లీ రీఎంట్రీ!

Jul 18 2026 5:41 PM | Updated on Jul 18 2026 6:35 PM

US Government Employees Now Allowed To Download TikTok

భద్రతా పరమైన కారణాల వల్ల ఒకప్పుడు నిషేధానికి గురైన టిక్‌టాక్‌ యాప్‌ను ఫెడరల్ ఉద్యోగులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అమెరికా న్యాయ శాఖ తెలిపింది. అయితే ఈ అనుమతి ఆయా ప్రభుత్వ సంస్థల నిబంధనలకు లోబడి ఉంటుంది.

టిక్‌టాక్ అనేది చైనాకు చెందిన యాప్ కావడంతో అమెరికా ప్రభుత్వం చాలా కాలంగా వినియోగదారుల డేటా భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కారణంగానే 2022లో ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించే ఫోన్లు.. కంప్యూటర్లలో టిక్‌టాక్ వాడకాన్ని పూర్తిగా నీచేధించడం జరిగింది. అయితే.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలు, వినియోగదారుల డేటా భద్రత విషయంలో కొత్త ఒప్పందం కుదిరింది.

బైట్‌డాన్స్ అమెరికా వినియోగదారుల డేటా, యాప్ నిర్వహణపై నియంత్రణను టిక్‌టాక్ యూఎస్డీఎస్ అనే జాయింట్ వెంచర్‌కు అప్పగించింది. దీంతో అమెరికా న్యాయశాఖ ప్రస్తుతం ఉన్న టిక్‌టాక్ వెర్షన్ వల్ల పెద్దగా భద్రతా ప్రమాదం లేదని అభిప్రాయపడింది. కాబట్టి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనుమతిచ్చింది.

అమెరికాలో టిక్‌టాక్‌కు భారీ స్థాయిలో ఆదరణ ఉంది. దాదాపు 20 కోట్ల మంది అమెరికన్లు ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అందుకే టిక్‌టాక్‌పై తీసుకునే ప్రతి నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. మొత్తం మీద టిక్‌టాక్‌ మళ్లీ వచ్చేసిందన్నమాట.

ఇదీ చదవండి: లెక్కల్లో 51 మార్కులే.. కట్ చేస్తే రూ.వేల కోట్ల కంపెనీ!: ఎవరీ పవన్ కుమార్ చందన?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement