న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వేదాంత గ్రూప్ సంస్థ హిందుస్తాన్ జింక్ (హెచ్‌జెడ్‌ఎల్) నికర లాభం రెట్టింపునకు పైగా పెరిగి రూ. 5,469 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇది రూ. 2,234 కోట్లు. ఇక ఆదాయం సైతం 72 శాతం ఎగిసి రూ. 13,033 కోట్లకు పెరిగింది. క్రితం క్యూ1లో ఇది రూ. 7,591 కోట్లు.
లోహాల ధరలు .. ఉత్పత్తి పెరగడం, బై–ప్రోడక్టుల ద్వారా మరింత ఆదాయం లభించడం, డాలరు పటిష్టంగా ఉండటం తదితర అంశాల కారణంగా ఆదాయం గణనీయంగా వృద్ధి చెందినట్లు కంపెనీ తెలిపింది. మరోవైపు, ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్ మాజీ సీఎండీ అమరేందు ప్రకాశ్‌ని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హోల్ టైమ్ డైరెక్టర్‌గా నియమించుకున్నట్లు వివరించింది. ఇది ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది.


