శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 166.49 పాయింట్లు లేదా 0.21 శాతం లాభంతో 78,094.64 వద్ద, నిఫ్టీ 43.95 పాయింట్లు లేదా 0.18 శాతం లాభంతో 24,361.10 వద్ద నిలిచాయి.
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, నెట్‌వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇండియా లిమిటెడ్, సజిలిటీ లిమిటెడ్, సఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


