128 కిమీ రేంజ్ అందించే.. విడా కొత్త స్కూటర్! | Hero Vida VX2 Go Launched At Rs 1 13 Lakh | Sakshi
Sakshi News home page

128 కిమీ రేంజ్ అందించే.. విడా కొత్త స్కూటర్!

Aug 1 2026 3:43 PM | Updated on Aug 1 2026 3:49 PM

Hero Vida VX2 Go Launched At Rs 1 13 Lakh

హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా.. దేశీయ విఫణిలో ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన గో ఎఫ్‌బీ పేరుతో వీడా విఎక్స్2 సరికొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.1.13 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది కంపెనీకి చెందిన అధికారిక డీలర్‌షిప్‌లో అందుబాటులో ఉంటుంది. డెలివరీలు ఆగస్టు 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ కొత్త వేరియంట్‌ 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 128 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుంది. ఇది DC ఫాస్ట్ ఛార్జర్‌తో, 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవ్వడానికి 65 నిమిషాలు పడుతుంది. వీఎక్స్2 గో ఎఫ్‌బీ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్‌కు 6kW మోటార్ జత చేయబడి ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు.

హీరో విడా వీఎక్స్2 గో ఎఫ్‌బీ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.3 అంగుళాల LCD కన్సోల్ పొందుతుంది. దీనికి టర్న్-బై-టర్న్ నావిగేషన్ కోసం స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సౌకర్యం ఉంది. సీటు కింద ఉండే స్టోరేజ్ సామర్థ్యం 27.2 లీటర్లు. కాబట్టి ఇది అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement