రివర్ ఇండీ సరికొత్త రికార్డ్.. మూడేళ్లలో.. | River Indie Electric Scooter Crosses 50000 Units Production Milestone | Sakshi
Sakshi News home page

రివర్ ఇండీ సరికొత్త రికార్డ్.. మూడేళ్లలో..

Jul 26 2026 3:57 PM | Updated on Jul 26 2026 4:00 PM

River Indie Electric Scooter Crosses 50000 Units Production Milestone

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివర్ మొబిలిటీ, కర్ణాటకలోని హోస్కోట్‌లో ఉన్న తమ ఉత్పత్తి కేంద్రం నుండి 50,000వ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ సంస్థ 2023 ఆగస్టు 25న ఇండీ తయారీని ప్రారంభించింది, అంటే ఈ మైలురాయిని చేరుకోవడానికి మూడు సంవత్సరాల కంటే తక్కువ సమయం పట్టిందన్నమాట.

ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది రివర్ మొబిలిటీకి చెందిన ఏకైక ఉత్పత్తి. అయినప్పటికీ సంస్థ ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 2025లో జెన్ 3 వెర్షన్ పరిచయంతో ఈ స్కూటర్ లేటెస్ట్ అప్‌డేట్‌ను పొందింది.

జెన్ 3 అప్‌డేట్‌తో.. రివర్ కొత్త టైర్లు, అప్డేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, మెరుగైన స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మాత్రమే కాకుండా హిల్-హోల్డ్ అసిస్ట్‌ను కూడా జోడించారు. అయితే వినియోగదారుల అభిప్రాయం మేరకు సంస్థ స్కూటర్ రైడింగ్ డైనమిక్స్‌ను మెరుగుపరిచినట్లు సమాచారం.

ఇండీ ప్రధానమైన ఆకర్షణలలో ఒకటి దాని ప్రాక్టికాలిటీ. ఇది సీటు కింద 43 లీటర్ల స్టోరేజ్‌ను, దానికి తోడు 12-లీటర్ల గ్లోవ్ బాక్స్‌ను అందిస్తుంది. దీంతో ఇది భారతదేశంలో అమ్మకానికి ఉన్న ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలుస్తుంది.

ఇండీకి 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు 9 bhp పవర్ అందించే ఎలక్ట్రిక్ మోటార్ అమర్చారు. ఇది 163 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. కాగా ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. కంపెనీ ప్రకారం, 750W ఛార్జర్‌ను ఉపయోగించి, బ్యాటరీ 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది. బ్రేకింగ్ విధులను రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ నిర్వహిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement