ఒకే ప్లాంట్.. 30 లక్షల వెహికల్స్! | Mahindra Rolls Out Three Millionth Vehicle From Chakan Plant | Sakshi
Sakshi News home page

ఒకే ప్లాంట్.. 30 లక్షల వెహికల్స్!

Jul 16 2026 9:16 PM | Updated on Jul 16 2026 9:17 PM

Mahindra Rolls Out Three Millionth Vehicle From Chakan Plant

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన చకన్ ప్లాంట్ నుంచి 30 లక్షల (3 మిలియన్) వాహనాన్ని విడుదల చేసింది. కంపెనీ ఈ మైలురాయి యూనిట్‌గా బీఈ 6 ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది.

ప్రస్తుతం మహీంద్రా చకన్ ప్లాంట్‌లో తయారు చేస్తున్న మొత్తం 19 వాహనాల్లో బీఈ6 ఎలక్ట్రిక్ ఒకటి. ఇక్కడ ప్యాసింజర్ వాహనాలు మాత్రమే కాకుండా కమర్షియల్ వాహనాల ఉత్పత్తి కూడా జరుగుతోంది.

చకన్ ప్లాంట్‌లో మహీంద్రా సంస్థ ప్రారంభ ఉత్పత్తి కొంత నెమ్మదిగా సాగినప్పటికీ.. ఆ తరువాత గణనీయంగా పెరిగిందని కంపెనీ బిజినెస్ ప్రెసిడెంట్, ఆర్. వేలుసామి పేర్కొన్నారు. ఇది వినియోగదారులలో పెరుగుతున్న నమ్మకాన్ని, మా సిబ్బంది, భాగస్వాములు, సరఫరాదారుల నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు.

మహీంద్రా 2009 డిసెంబర్‌లో చకన్ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించింది. 2018 సెప్టెంబర్‌లో 10 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని దాటింది. 20 లక్షల మైలురాయి 2024 మార్చిలో చేరుకోగా.. సుమారు 27 నెలల తర్వాత, 2026 జూలైలో మూడు మిలియన్ల యూనిట్ల మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది.

మహీంద్రా బీఈ6
ఇక బీఈ6 విషయానికి వస్తే.. ఇది INGLO ఆర్కిటెక్చర్‌పై నిర్మించిన మహీంద్రా మొదటి రెండు 'బోర్న్ ఎలక్ట్రిక్' SUVలలో ఒకటి. ఇది ఎక్స్ఈవీ 9ఈ కారుతో పాటు 2024 చివరలో భారతదేశంలో విడుదలైంది. దీని డెలివరీలు 2025లో ప్రారంభమయ్యాయి. BE 6 ఐదు ట్రిమ్ స్థాయిలలో, 59 kWh, 79 kWh బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. ధరలు రూ. 18.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement