E20తో మైలేజీ తగ్గొచ్చు.. కానీ..! | Mahindra Confirms E20 Compatibility For Older Petrol Cars | Sakshi
Sakshi News home page

E20తో మైలేజీ తగ్గొచ్చు.. కానీ..!

Jul 6 2026 1:18 PM | Updated on Jul 6 2026 1:32 PM

Mahindra Confirms E20 Compatibility For Older Petrol Cars

భారత్‌లో E20 పెట్రోల్‌పై పెద్ద చర్చ జరుగుతున్న తరుణంలో.. మహీంద్రా కంపెనీ కీలక ప్రకటన చేసింది. తమ వాహనాల్లో E20 వినియోగంపై కీలక స్పష్టత ఇచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

కంపెనీ అధికారికంగా ఇచ్చిన ప్రకటనలో, తమ వాహనాల్లోని ఇంజిన్లు ప్రస్తుత పెట్రోల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని, అన్ని వాహనాలు E20తో పనిచేస్తాయని పేర్కొంది. అయితే.. 2025 ఏప్రిల్ 1 తర్వాత తయారైన కొత్త మోడళ్లు ప్రత్యేకంగా E20 కోసం ట్యూన్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో మెరుగైన యాక్సిలరేషన్, ఇంధన సామర్థ్యం ఉండేలా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది.

2025 ఏప్రిల్‌కు ముందు తయారైన వాహనాలు కూడా E20 పెట్రోల్‌తో సురక్షితంగానే నడుస్తాయని మహీంద్రా స్పష్టం చేసింది. అయితే డ్రైవింగ్, రోడ్డు పరిస్థితులపై ఆధారపడి మైలేజీలో లేదా పికప్‌లో చిన్న మార్పులు కనిపించవచ్చని పేర్కొంది.

ఈ20 పెట్రోల్ ఇంజిన్‌కు హాని చేయదు, కేవలం ఇంధనంలో ఎనర్జీ కంటెంట్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం మాత్రమే ఉంటుందని మహీంద్రా స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో E20పై అనేక సందేహాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కంపెనీ ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇతర కంపెనీల స్పందన
E20 పెట్రోల్ విడుదలను సమర్థిస్తూ టయోటా, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, హ్యుందాయ్ ప్రతినిధులు పాల్గొన్న ప్రభుత్వ పత్రికా సమావేశం జరిగిన కొద్దిసేపటికే మహీంద్రా ఈ వివరణ ఇచ్చింది.అయితే కొంతమంది వాహన వినియోగదారులు మైలేజీ తగ్గిందని చెబుతున్నారని కూడా వారు అంగీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement