మహీంద్రా సరికొత్త ‘యువోటెక్‌ ప్లస్‌’ ట్రాక్టర్‌ | Mahindra Yuvo Tech Plus Tractor | Sakshi
Sakshi News home page

మహీంద్రా సరికొత్త ‘యువోటెక్‌ ప్లస్‌’ ట్రాక్టర్‌

Jul 7 2026 6:07 PM | Updated on Jul 7 2026 6:12 PM

Mahindra Yuvo Tech Plus Tractor

మహీంద్రా ట్రాక్టర్స్‌ సరికొత్త ‘యువోటెక్‌ ప్లస్‌ 585 డీఐ వీ1’ మోడల్‌ను దేశవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ మల్టీ పర్పస్‌ ట్రాక్టర్‌లో శక్తివంతమైన ‘ఎంబుల్‌’ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 30% అదనపు పవర్‌ను ఇవ్వడం వల్ల ఎలాంటి కఠినమైన పొలాల్లోనైనా స్థిరంగా పనిచేస్తుంది. ఆకర్షణీయమైన మెటాలిక్‌ రెడ్‌ కలర్‌లో లభించే ఈ ట్రాక్టర్‌.. టూ–వీల్‌ (2డబ్ల్యూడీ), ఫోర్‌–వీల్‌ డ్రైవ్‌ (4డబ్ల్యూడీ) ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

రైతుల సౌకర్యార్థం ఇందులో 12 ఫార్వర్డ్, 3 రివర్స్‌ గేర్‌ సిస్టమ్, మల్టీ–స్పీడ్‌ పీటీఓ, పవర్‌ స్టీరింగ్, బరువైన వ్యవసాయ పరికరాలను సులభంగా ఎత్తగలిగే పటిష్ట హైడ్రాలిక్‌ ఫీచర్లను అందించారు. కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లలో విజయవంతమయ్యాక, ఇప్పుడు దీనిని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చామని కంపెనీ సీఈఓ హర్ష్ రాయ్‌ తెలిపారు. పరిశ్రమలోనే అత్యుత్తమంగా ఆరేళ్ల వారంటీతో వస్తున్న ఈ ట్రాక్టర్, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మహీంద్రా డీలర్‌షిప్‌లలో లభిస్తుందని సంస్థ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement