ప్రపంచంలోనే అత్యంత కఠినమైన 10 పరీక్షలు ఇవే! | Top 10 Toughest Exams in the World 2026: Gaokao, UPSC, IIT JEE Lead the List | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన 10 పరీక్షలు ఇవే!

Aug 1 2026 12:46 PM | Updated on Aug 1 2026 12:53 PM

Top 10 Toughest Exams in the World 2026 check list

విద్యాభ్యాసం, ఉన్నత ఉద్యోగ సాధన, ప్రొఫెషనల్ గుర్తింపు ప్రక్రియల్లో పరీక్షలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని పరీక్షలు మాత్రం విషయ పరిజ్ఞానంతోపాటు అభ్యర్థుల మానసిక స్థైర్యాన్ని, విశ్లేషణాత్మక శక్తిని, ఒత్తిడిని తట్టుకునే సమయస్ఫూర్తిని అత్యంత క్లిష్ట స్థాయిలో పరీక్షిస్తాయి. అంతులేని సిలబస్, సుదీర్ఘమైన పరీక్షా సమయం, కఠినమైన ఎంపిక విధానం, అత్యల్ప ఉత్తీర్ణత శాతాల కారణంగా ఈ కింది 10 పరీక్షలు ప్రపంచంలోనే అత్యంత కఠినమైనవిగా గుర్తింపు పొందాయి.

కొన్ని సర్వేల ‍ప్రకారం ప్రపంచంలోనే టాప్ 10 కఠినమైన పరీక్షల జాబితా

1. గావోకావో (Gaokao Exam) – చైనా: విశ్వవిద్యాలయ ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైనది.

2. ఐఐటీ జీఈఈ (IIT JEE) – భారతదేశం: ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్ సీటు కోసం జరిగే పోటీ పరీక్ష.

3. యూపీఎస్సీ (UPSC) – భారతదేశం: ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత సివిల్ సర్వీసెస్ అధికారుల ఎంపికకు నిర్వహించే సుదీర్ఘ ప్రక్రియ.

4. మెన్సా (Mensa IQ Test) – ఇంగ్లండ్: ప్రపంచ జనాభాలోని అత్యుత్తమ మేధావులను గుర్తించే ఐక్యూ పరీక్ష.

5. జీఆర్‌ఈ (GRE) – అమెరికా / కెనడా: విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, పరిశోధక కోర్సుల ప్రవేశాల కోసం రాసే ప్రామాణిక పరీక్ష.

6. సీఎఫ్‌ఏ (CFA) – అమెరికా / కెనడా: ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ రంగాల్లో మూడు స్థాయిల్లో జరిగే అత్యున్నత ప్రొఫెషనల్ ఎగ్జామ్.

7. సీసీఐఈ (CCIE) – అమెరికా: సిస్కో ఐటీ నెట్‌వర్కింగ్ రంగంలో ప్రాక్టికల్ ల్యాబ్‌తో కూడిన అత్యంత క్లిష్టమైన నెట్‌వర్క్ ఎక్స్‌పర్ట్ ఎగ్జామ్.

8. గేట్ (GATE) – భారతదేశం: ఇంజినీరింగ్ ఉన్నత విద్య, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం రాసే పరీక్ష.

9. యూఎస్‌ఎమ్‌ఎల్ఈ (USMLE) – అమెరికా: అమెరికాలో మెడికల్ లైసెన్స్ సాధించడం కోసం వైద్యులు రాసే మూడు దశల లైసెన్సింగ్ పరీక్ష.

10. కాలిఫోర్నియా బార్ ఎగ్జామ్ – అమెరికా: న్యాయశాస్త్ర వృత్తి కోసం అతి తక్కువ ఉత్తీర్ణత శాతంతో కూడిన కఠినమైన లీగల్ ఎగ్జామ్.

ఇదీ చదవండి: స్కూల్స్ వద్ద జంక్ ఫుడ్ బ్యాన్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement