Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Elections 2024 Judgement Counting Six More Days
ఏపీ ప్రజా తీర్పు.. ఇంకో 6 రోజులే!

జూన్‌ 4.. సరిగ్గా ఇంకో ఆరో రోజులు మాత్రమే. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే రోజది. అదే సమయంలో ఒడిషాతో పాటు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు.. ఎలాంటి తీర్పు వెలువడనుందో అని రాజకీయ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.ఏపీలోనూ ఈ రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు పైన రాజకీయ వర్గాల్లో, మరోవైపు ఓట్లేసిన ప్రజల్లోనూ టెన్షన్ మొదలైంది. ఇదే అదనుగా గెలుపొటములపై పందేలు జోరుగా సాగుతున్నాయి. కవైపు తమ రాజకీయ భవితవ్యాన్ని తేల్చేవిగా కూటమి ఈ ఎన్నికలు భావిస్తున్నాయి. మరోవైపు వైఎస్సార్‌సీపీ మాత్రం మొదటి నుంచి గెలుపు ధీమా ప్రదర్శిస్తోంది. అయితే.. ప్రధాన పార్టీల మధ్య గెలుపు పైన ఉత్కంఠ కొనసాగుతుంటే.. పోలింగ్ అనంతర పరిణామాలతో ఏర్పడిన ఉద్రిక్తత మరో టెన్షన్ కు కారణమవుతోంది.ఎన్నికల పోలింగ్‌ టైంలో జరిగిన హింసాత్మక ఘటనలు, తమ పార్టీ నేతలను.. కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం, తదనంతర పరిణామాలపై వైఎస్సార్‌సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఏపీలో పోలీసులు, ఎన్నికల సంఘం తీరును ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కౌంటింగ్‌ రోజున అవాంఛనీయ ఘటనలు జరగవచ్చనే అనుమానాలతో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో.. ఈసీ అలర్ట్‌ అయ్యింది. మరింత విమర్శలు వెల్లువెత్తకుడా ముందస్తు చర్యలు చేపట్టింది.శాంతి భద్రతలను విఘాతం కల్గకుండా.. ఏపీ ఎలక్షన్ కౌంటింగ్‌ కోసం అన్ని జిల్లాలకు స్పెషల్‌ పోలీసు ఆఫీసర్లను నియమించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. కృష్ణా జిల్లాకు చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీగా పని చేస్తున్న లావణ్య లక్ష్మిని.. విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు సీఐడీ డీఎస్పీ సోమన్నను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకంగా పల్నాడు గురించి చర్చించారు. ఏకంగా ఎనిమిది మంది పోలీసు అధికారులను ప్రత్యేకంగా అక్కడ మోహరించారు.మరోవైపు ఈసీ కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. కౌంటింగ్ రోజున భద్రత కోసం ఎన్నికల సంఘం భారీగా కేంద్ర బలగాలను రాష్ట్రానికి రప్పించింది. పూర్తిగా కేంద్రబలగాల నిఘా నీఢలో కౌంటింగ్ జరిగేలా ప్లాన్ చేసుకుంది. కౌంటింగ్ తర్వాత కూడా విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్‌ యాక్షన్‌ తీసుకుంటోంది. మొత్తంగా.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు చెబుతోంది.ఇదీ చదవండి: ఈ సడలింపులు.. ‘పచ్చ’సిరాతో! పార్టీల తీరు ఇలా..ఏపీలో వైఎస్సార్‌సీపీలో జోష్‌ కనిపిస్తోంది. మరోసారి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీనే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ కీలక నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఓ అడుగు ముందుకు వేసి జూన్ 9న కాబోయే పాలనా రాజధాని విశాఖలో వైఎస్‌ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని చెబుతున్నారు. అయితే.. గత ఐదేళ్ల కాలంలో నిత్యం ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న టీడీపీ మాత్రం.. ఎన్నికల తర్వాత సైలెంట్‌ అయిపోయింది. కూటమికి బాకా ఊదిన ఎల్లో మీడియా ఒకట్రెండు రోజులు విజయం కూటమిదే అంటూ హడావిడి చేసినప్పటికీ.. తర్వాత చల్లబడి పోయింది. బీజేపీ, కాంగ్రెస్‌ల గురించి ప్రస్తావించుకోవడం కూడా అనవసరమేమో!.ఇక.. ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం జగన్‌ అధికారికంగా లండన్‌పర్యటనకు వెళ్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మాత్రం అత్యంత గోప్యంగా పర్యటనకు వెళ్లడమూ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దగ్గుబాటి పురందేశ్వరి, షర్మిల సంగతి సరేసరి. ఫలితాలను ముందే ఊహించి వాళ్లు ఇలా మౌనంగా ఉండిపోతున్నారా? అనే చర్చా ఏపీలో నడుస్తోంది ఇప్పుడు.

 Balakrishna Behaviour With Anjali In Gangs Of Godavari Pre Release Event
హీరోయిన్‌ని తోసేసిన బాలకృష్ణ.. అందరిముందు మద్యం తాగుతూ!

హీరో బాలకృష్ణ మరోసారి అనుచితంగా ప్రవర్తించారు. స్టేజీపై తన పక్కనే నిలబడి ఉన్న హీరోయిన్ అంజలిని తోసేశారు. అయితే ఆమె తమాయించుకుని నిలబడింది. అదే టైంలో లోపల ఇబ్బందిగా ఉన్నప్పటికీ బయటకు నవ్వుతూ కవర్ చేసింది. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు)విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా మే 31న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన బాలకృష్ణ చాలా చీప్‌గా ప్రవర్తించాడు. హీరోయిన్ అంజలిని నెట్టేయడంతో పాటు అందరిముందు వాటర్ బాటిల్‌లో మద్యం సేవించారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.బాలకృష్ణని చేసిన దాన్ని ఆయన ఫ్యాన్స్ సమర్ధించుకుంటారేమో! కానీ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం, నోటీ దురుసుతో ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం గతంలోనూ పలుమార్లు జరిగింది. అమ్మాయిలు, నర్సులపై గతంలో చౌకబారు కామెంట్స్.. 'అక్కినేని తొక్కినేని' అని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అనడం లాంటివి బాలకృష్ణ ఎలాంటి వాడో చెప్పకనే చెబుతుంటాయి. కొన్నాళ్ల ముందు తమిళ హీరోయిన్ విచిత్ర కూడా ఇతడు పేరు చెప్పకుండా తనని ఓసారి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. ఇలా చెప్పుకొంటూ పోతే బాలకృష్ణ బాగోతాలెన్నో!(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

 Meet Bollywood actress who wore outfits worth over Rs 100 crores at Cannes 2024
Cannes 2024 రూ. 105 కోట్ల విలువైన డ్రెస్‌లు : ఈ భామ ఎవరో గుర్తుపట్టండి!

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ సినీ, ఫ్యాషన్‌ ప్రముఖులు సందడి చేస్తున్నారు. ప్రతీ ఏడాది 12-రోజుల ఈ వేడుకులో ఫ్యాషన్‌ స్టయిల్‌, బ్యూటిఫుల్‌ ఫ్యాషన్ గేమ్‌, లుక్స్‌తో అదరగొట్టేస్తున్నారు. 77వ కేన్స్‌ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కియారా అద్వానీ, ప్రీతి జింటా, దీప్తి సాధ్వానీ, శోభితా ధూళిపాళ, అదితి రావ్ హైదరీ తళుక్కున మెరిసారు. అంతేకాదు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ త్యాగికూడా అందరి చూపును తన వైపు తిప్పుకుంది. అయితే వీరిలో మరింత స్పెషల్‌గా నిలుస్తోంది నటి, మోడల్‌ ఊర్వశి రౌతేలా.ఊర్వశీ రౌతేలా ఖరీదైన ఫ్యాషన్‌ దుస్తులతో టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా నిలిచింది. ఈ బ్యూటీ కేన్స్ వేదికపై ధరించిన డ్రెస్ ధరలు ఏకంగా రూ.105 కోట్లు. ముఖ్యంగా ఫస్ట్ డే ధరించిన పూల పింక్ గౌన్ స్పెషల్‌గా నిలిచింది. దీని ధర ఏకంగా రూ.47 కోట్లు అని తెలుస్తోంది. అలాగే, కేన్స్ నాలుగవ రోజు వేసుకున్న బ్లాక్ అండ్ వైట్ కస్టమ్ మేడ్ డ్రెస్ ధర ఏకంగా రూ.58 కోట్లు. సో.. మొత్తంగా ఈ రెండు డ్రెస్సులు కలిపి రూ.105 కోట్లు వరకు ఉంటుందనేది హాట్‌ టాపిక్‌గా నిలుస్తోంది. ఐశ్వర్య, కియారా అద్వానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రీతి జింటా లాంటి తారలు ధరించిన డ్రెస్‌ల ధరలు లక్షల్లో ఉంటుందిట. తరువాత రోజుల్లో కూడా తనదైన స్టయిల్‌లో అదర గొడుతోంది ఈ భామ.👉:​​​​​​​ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

BJP MP Laxman Sensational Comments On BRS And Congress
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఢిల్లీ పెద్దల ఒత్తిడితో వల్లే రేవంత్‌ రాజీ: ఎంపీ లక్ష్మణ్‌

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు. ఇది సామాన్య నేరం కాదు.. దేశద్రోహం లాంటిది అంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో సూత్రధారిపై చర్యలు తీసుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేశారు.కాగా, ఎంపీ లక్ష్మణ్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరంలో అవినీతిని వెలికితీస్తామన్న సీఎం రేవంత్‌ ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారిపై చర్యలు తీసుకోవడంలో సీఎం రేవంత్‌ వెనకడుగు వేస్తున్నారు. ఢిల్లీ పెద్దల ఒత్తిడితోనే రేవంత్‌ ఈ కేసులో రాజీ పడ్డారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్‌లో బాధితుడు అయినప్పటికీ రేవంత్ ఏం చేయలేని స్థితిలో ఉన్నారు.కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని ఈ వ్యవహారంతో తేలిపోయింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ ఇండియా కూటమిలో చేరుతోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనే ఆరోపణలతో ఢిల్లీ నేతను అరెస్ట్‌ చేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితను కాపాడేందుకు ఈ కేసును వాడుకున్నారు. ఇక, తెలంగాణలో అందెశ్రీ పాటను అధికార గీతం చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాము. తెలంగాణలో బీజేపీ డబుల్‌ డిజిట్‌ రావడం ఖాయం. ఆగస్టు సంక్షోభం వస్తే మేము రక్షించే ప్రసక్తే లేదు అంటూ కామెంట్స్‌ చేశారు.

AP Elections 20204: Amid Results Tough Time To Nara Lokesh In Mangalagiri
సినబాబుకి మరోసారి మంగళమేనా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మూడు శాఖల మాజీ మంత్రి, మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు పరీక్షా సమయమిది. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన ఆయన ఈసారైనా గట్టెక్కగలిగితే ఊపిరి పీల్చుకున్నట్లే. లేదంటే రాజకీయంగా అధోగతే అనే అనుమానాలు స్వపక్షీయుల్లోని సీనియర్లు, శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి. పోలింగ్‌ అనంతరం విభిన్న కోణాల్లో వేసుకుంటున్న అంచనాలలో అంతర్గత అనుమానాలు అనేకం ఉన్నప్పటికీ బయటకు మాత్రం టీడీపీ గెలుపుపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తొలి అడుగులే తడబాటుతో.. రాష్ట్ర విభజనానంతరం అధికారంలోకి వచ్చి అమరావతిని రాజధాని కేంద్రంగా ప్రకటించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని విస్తతపరచిన నాటి పాలకపక్షానికి గుంటూరు, కష్ణా జిల్లా ప్రజలు తగురీతినే బుద్ధి చెప్పారు. 2019 సాధారణ ఎన్నికల్లో, ఆ తరువాత జరిగిన గుంటూరు, విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీకి కర్రుకాల్చి వాతపెట్టారు. కరకట్ట వెంట అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండానే ఎమ్మెల్సీగా ఎంపికై మూడు శాఖల మంత్రిగా కొనసాగిన లోకేష్‌ మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా చేసిందంటూ ఏమీలేదనే విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకష్ణారెడ్డి(ఆర్కే) చేతిలో పరాజయం పాలైన లోకేష్‌ ఆ తరువాత అయినా రాజకీయంగా వ్యూహాత్మక అడుగులు వేశారా అంటే అదీ లేదు. టీడీపీ ఆవిర్భావ సమయంలో 1983, 1985 ఎంఎస్‌ఎస్‌ కోటేశ్వరరావు మినహా గెలిచిన దాఖలాలు లేవు. 1994లో సీపీఎం నుంచి రామ్మోహన్‌రావు గెలుపొందారు. బీసీ సామాజికవర్గం నుంచి గోలి వీరాంజనేయులు, మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల విజయం సాధించారు. ఆళ్ల రామకష్ణారెడ్డి రెండు పర్యాయాలు గెలుపొందడానికి పెదకాకాని వాస్తవ్యుడు కావడం, వ్యక్తిగతంగా మంచి గుర్తింపు ఉండటం, అన్నిటికన్నా మించి వై.ఎస్‌. కుటుంబానికి సన్నిహితులు కావడం. బీసీలకు చెందిన నియోజకవర్గంగా గుర్తింపున్న మంగళగిరి నుంచి తాను పోటీ చేయడమంటే సాహసించినట్లేనని లోకేష్‌ అభిప్రాయపడ్డారే తప్ప అందుకు తగిన విధంగా క్షేత్రస్థాయిలో దష్టి సారించిన దాఖలాలు లేవు. వైఎస్సార్‌ సీపీ వ్యూహాత్మక అడుగులు.. వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన ఆళ్ల స్థానంలో స్థానికురాలు, విద్యావంతురాలైన మురుగుడు లావణ్యను పోటీకి దింపడమే వైఎస్సార్‌ సీపీ విజయానికి తొలిమెట్టుగా పరిశీలకుల అభిప్రాయం. నియోజకవర్గంలో మెండుగా ఓటర్లు కలిగిన సామాజికవర్గానికి చెందిన లావణ్యది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. తల్లి కాండ్రు కమల మాజీ ఎమ్మెల్యే, మామ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉన్న వ్యక్తి. ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా. వీటికితోడు ఆ సామాజికవర్గానికి చెందిన స్థానిక సీనియర్‌ నాయకులైన చిల్లపల్లి మోహన్‌రావు, గంజి చిరంజీవి తదితరులకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్రస్థాయి పదవులు కట్టబెట్టింది. కార్పొరేషన్ల డైరెక్టర్లుగా, దుర్గగుడి పాలకమండలి సభ్యులుగాను నియమించింది. ఎమ్మెల్యే ఆళ్ల ముందుచూపుతో దుగ్గిరాల (పసుపు) మార్కెట్‌ యార్డు చైర్మెన్‌ పదవిని ఎస్సీ, మైనార్టీలకు, మంగళగిరి ఏఎంసీని యాదవ, పద్మశాలి వర్గీయులకు అప్పగించారు. ఇక పార్టీ నాయకత్వం సోషల్‌ ఇంజినీరింగ్‌లో ఆచితూచి అడుగులేసింది. ఈ విషయంలో టీడీపీ ఎక్కడా సరితూగలేదు. అభివృద్ధికి దిక్సూచిగా.. మంగళగిరి, తాడేపల్లి మండలాలను కలిపి కార్పొరేషన్‌గా చేయడం, ప్రత్యేక గ్రాంటుగా రూ.130 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కేటాయించడం, ఎవరూ ఊహించని రీతిలో గౌతమబుద్ధ రోడ్డును అభివద్ధి చేయడం, తొమ్మిది అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, సర్వ హంగులతో వై.ఎస్‌.ఆర్‌ క్రీడాప్రాంగణాన్ని తీర్చిదిద్దడం, అంతర్గత రహదారుల విస్తరణ, అభివద్ధి, విభిన్న సామాజికవర్గాల వారికి భవనాలు, కల్యాణ మండపాలను నిర్మించడం, ప్రధానమంత్రి దష్టికి తీసుకెళ్లి అభినందనలు అందుకునేలా పద్మశాలీయులకు మగ్గంలో శిక్షణ ఏర్పాట్లు నెలకొల్పడం తదితరాలు నియోజకవర్గ అభివద్ధికి దిక్సూచిగా నిలిచాయి. పల్లెల్లో డొంకరోడ్లు, సిమెంటు రోడ్లు, అంబేడ్కర్, జగ్జీవన్‌ రామ్, జ్యోతిరావుపూలే, సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తదితర ప్రముఖుల విగ్రహాల ఏర్పాట్లు నియోజకవర్గానికి అదనపు హంగులుగా మారాయి. ఆర్కే సొంతంగా నిధులు సమకూర్చడం, అవినీతికి తావు లేకుండా పనులు చేయడం, తరతమ భేదం లేకుండా అన్ని సామాజికవర్గాలకు చేరువగా ఉండటం పార్టీకి అన్నివిధాలా కలిసొచ్చింది. కార్పొరేట్‌ తరహాలో లోకేష్‌ బృందం.. మంగళగిరి నుంచే పోటీచేయాలని నిర్ణయించుకున్న లోకేష్‌ అందుకు తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లలేదని స్వపక్షీయులే అంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో కాని, ఆ తరువాతైనా వ్యూహం కొరవడిందంటున్నారు. నియోజకవర్గానికి చుట్టపుచూపుగా రావడం, అతితక్కువ మందిని కలవడం, స్థానికేతరుడు కావడం, ఆయన బందం కార్పొరేట్‌ తరహాలో వ్యవహారాలు నడపడం ప్రజలను అంతగా ఆకట్టుకోలేకపోయాయనే విమర్శలు తొలి నుంచే ఉన్నాయి. తోపుడుబండ్లు, బడ్డీ కొట్లు ఇవ్వడం, పెళ్లికానుక పేరుతో రూ.5,000, సుమారు ఓ ఏడాదిపాటు రెండు చోట్ల అన్న క్యాంటీన్లను నడపడం వలన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ ఉండటాన్ని, లోకేష్‌ అందుబాటులో లేకపోవడాన్ని ప్రజలు బేరీజు వేసుకునే స్థితి. కూటమి నేతలతో అంటీముట్టనట్లు.. ఎన్నికలకు కూటమి కట్టినప్పటికీ నియోజకవర్గంలో జనసేన, బీజేపీలతో అంటీముట్టనట్లే పార్టీ వ్యవహరించిందని టీడీపీ ముఖ్యులే అభిప్రాయపడుతూ వచ్చారు. సమన్వయ సమావేశం కూడా జరగకపోవడం గమనార్హం. ముస్లిం, క్రిస్టియ¯Œ ఓటర్లు దూరమవుతారనే భయంతో బీజేపీ వారిని దరిజేరనిచ్చిన దాఖలాలు దాదాపు లేవు. బీజేపీ, జనసేనలకు చెందిన యడ్లపాటి రఘునాథబాబు, పాతూరి నాగభూషణం, జగ్గారపు శ్రీనివాసరావు, పంచుమర్తి ప్రసాదరావు, పూర్ణచంద్రరావు, శివన్నారాయణ, చిల్లపల్లి శ్రీనివాసరావు, గాదె వెంకటేశ్వరరావు తదితర నాయకులు నియోజకవర్గం వారైనప్పటికీ వారితో కలిసి పనిచేసిన సందర్భాలు తక్కువే. వీరిలో జనసేనకు చెందిన ఒకరిద్దరికి కాస్త ప్రాధాన్యం ఇచ్చారే తప్ప బీజేపీని పట్టించుకోలేదు. సీనియర్‌ నాయకులకే లోకేష్‌ అందుబాటులో ఉండరని, సెక్యూరిటీ వారిని దాటుకుని వెళ్లలేమని, కార్పొరేట్‌ తరహా రాజకీయాలు కొనసాగుతున్నప్పుడు తమలాంటి వారి సంగతి ఏంటనే ప్రశ్న సామాన్య ఓటర్ల మధ్య చర్చకు దారితీయడం నష్టదాయకంగా మారిందని అంచనా వేస్తున్నారు. లోకేష్‌ చుట్టూ ఆయన సామాజికవర్గం నేతలు చేరడం, తమ వాడైనందున ఓట్లు వేయండని హెచ్చరిక ధోరణిలో చెప్పడం, పెత్తందారీ పోకడలతో వ్యవహరించడం, మా మాట వినకపోతే మీకు ఉపాధి ఉండదని, కౌలుకు భూములు కూడా ఇచ్చేది లేదని కొందరు భయపెట్టే రీతిలో మాట్లాడటం కూడా ఓట్లకు చేటు తెచ్చేవే అనే వ్యాఖ్యానాలు పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి.:::సాక్షి, ప్రత్యేక ప్రతినిధి

today Gold and silver rates in bullion market
పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండి

కొంతకాలంగా ఈక్విటీమార్కెట్‌లు భారీగా పుంజుకున్నాయి. దాంతో బంగారం ధరలు పడిపోయాయి. ఇటీవల మళ్లీ మార్కెట్‌లో అనిశ్చితులు నెలకొంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మార్కెట్లు పడిపోతున్నాయి. దాంతో తిరిగి బంగారం ధరలు పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులు సేఫ్డ్‌ అసెట్స్‌లో భాగంగా పసిడిని ఎంచుకుంటారు. కాబట్టి బుధవారం గోల్డ్‌రేట్లు స్వల్పంగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో పసిడిధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.67,100 (22 క్యారెట్స్), రూ.73,200 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.250, రూ.270 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.350, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.380 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,910 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.67,250.. 24 క్యారెట్ల ధర రూ.73,350కు చేరింది.ఇదీ చదవండి: వ్యాధుల నియంత్రణకు ఏఐ సహాయంవెండి ధరలువెండి ధర మార్కెట్‌లో భారీగా పెరుగుతోంది. బుధవారం కేజీ వెండి ధర ఏకంగా రూ.1200 పెరిగి రూ.1,02,200కు చేరింది. దాంతో లక్షమార్కును దాటినట్లయంది. వెండి తయారీలో ప్రధానపాత్ర పోషిస్తున్న, స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్‌ అయిన ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్‌ జింక్‌ స్టాక్‌ ధర నెల రోజులుగా భారీగా పెరిగింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

T20 World Cup 2024: Netherlands Stun Sri Lanka In Warm Up Match
T20 World Cup 2024: లంకేయులకు షాక్‌.. పసికూన చేతిలో పరాభవం

శ్రీలంక క్రికెట్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. టీ20 వరల్డ్‌కప్‌ 2024 వార్మప్‌ మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌ చేతిలో వీరు చిత్తుగా ఓడారు. ఫ్లోరిడాలో జరిగిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌.. మైఖేల్‌ లెవిట్‌ (28 బంతుల్లో 55 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లెవిట్‌తో పాటు తేజ నిడమనూరు (27), కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (12 బంతుల్లో 27 నాటౌట్‌) సత్తా చాటారు. శ్రీలంక బౌలర్లలో దిల్షన్‌ మధుషంక (4-0-39-2) రాణించగా.. నువాన్‌ తుషార, దునిత్‌ వెల్లలగే, ఏంజెలో మాథ్యూస్‌ తలో వికెట్‌ పడగొట్టారు. Excellent success 🤩 Our first T20 World Cup Warm-up Match ends with a 𝘄𝗶𝗻 🆚🇱🇰Thanks for your enthusiasm 🦁#kncbcricket #nordek #t20worldcup #cricket #srivned #outofthisworld pic.twitter.com/eFKtpiY5V6— Cricket🏏Netherlands (@KNCBcricket) May 28, 2024అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఆదిలోనే తడబడింది. ఆ జట్టు పవర్‌ ప్లేలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 30 పరుగులు మాత్రమే చేసింది. ఆతర్వాత కూడా లంక బ్యాటర్లు లయను అందుకోలేకపోయారు. ఏ దశలో గెలుపు దిశగా సాగలేకపోయారు. 18.5 ఓవర్లలో 161 పరుగుల వద్ద లంక ఇన్నింగ్స్‌ ముగిసింది. ఫలితంగా నెదర్లాండ్స్‌ సంచలన విజయం నమోదు చేసింది. లంక ఇన్నింగ్స్‌ చివర్లో కెప్టెన్‌ హసరంగ బ్యాట్‌ ఝులిపించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. హసరంగ 15 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు వరుస సిక్సర్లు ఉండటం విశేషం. లంక ఇన్నింగ్స్‌లో హసరంగతో పాటు ధనంజయ డిసిల్వ (31), దసున్‌ షనక (35 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆర్యన్‌ దత్‌ 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టగా.. కైల్‌ క్లెయిన్‌ 2, లొగాన్‌ వాన్‌ బీక్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. నెదర్లాండ్స్‌ తమ రెండో వార్మప్‌ మ్యాచ్‌ను మే 30న ఆడనుంది. డల్లాస్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో ఆ జట్టు కెనడాను ఢీకొట్టనుంది. శ్రీలంక తమ రెండో వార్మప్‌ మ్యాచ్‌ను మే 31న ఆడనుంది. ఫ్లోరిడాలో జరిగే ఆ మ్యాచ్‌లో లంకేయులు ఐర్లాండ్‌తో తలపడతారు. ప్రపంచకప్‌లో శ్రీలంక, నెదర్లాండ్స్‌ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ రెండు జట్లు గ్రూప్‌-డిలో పోటీపడనున్నాయి. వీటితో పాటు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, నేపాల్‌ జట్లు గ్రూప్‌-డిలో ఉన్నాయి. భారత్‌, పాకిస్తాన్‌ జట్లు గ్రూప్‌-ఏలో ఉండగా.. ఈ రెండు జట్ల మధ్య సమరం జూన్‌ 9న న్యూయార్క్‌లో జరుగనుంది.

Rachakonda Police For Child Trafficking Gang in Delhi
చైల్డ్‌ ట్రాఫికింగ్‌ కేసులో నిందితులుగా పేరెంట్స్‌!

పాపం పసివాళ్లు. అభం శుభం తెలియని పసి మనసులు.. అటు కన్నవారికి ఇప్పుడు ఇటు పెంచిన మమకారానికి దూరం కావడంతో తల్లడిల్లిపోతున్నాయి. ఇంతకాలం తమ బిడ్డలేనని మురిసిపోయిన ఆ తల్లులు బరువెక్కిన హృదయంతో కంటతడి పెడుతున్నారు. పోలీసులు ఆ చిన్నారుల్ని తీసుకెళ్తుంటే వాహనాల వెంట పరుగులు పెడుతున్న దృశ్యాలు బాధ కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌, సాక్షి: నగరంలో కలకలం రేపిన చైల్డ్‌ ట్రాఫికింగ్‌ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లిన రాచకొండ కమిషనరేట్‌ బృందాలు.. విక్రయ ముఠా కోసం గాలింపు చేపట్టాయి. పోలీసుల అదుపులో ఉన్న ముఠా సభ్యులు అందించిన సమాచారం ప్రకారం.. కిరణ్‌, ప్రీతిలను కీలక సూత్రధారులుగా నిర్ధారించుకున్నారు. ఈ ముఠా ఇప్పటివరకు 50 మందికి విక్రయించినట్లు తేలింది. గుంటూరు, విజయవాడ, కరీంనగర్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఆ పిల్లల్ని అమ్మేసినట్లు గుర్తించింది. అయితే.. ఇప్పటివరకు 16 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు.. ఇటు నిందితులతో పాటు అటు మిగిలిన 34 మంది చిన్నారుల ఆచూకీ కోసం, ఇంకోవైపు ఈ పిల్లల అసలు తల్లిదండ్రులు ఎవరు? అనే అంశాలపై విడివిడిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో 13 మంది పిల్లల్ని కొనుగోలు చేసిన తల్లిదండ్రులపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. చైల్డ్‌ ట్రాఫికింగ్‌ కేసులో ఆ పేరెంట్స్‌ను నిందితులుగా ఈ కేసులో చేర్చారు. దీంతో వాళ్లంతా లబోదిబోమంటున్నారు.ఇదీ చదవండి: వాట్సాప్‌లో ఫొటోలు.. ముహూర్తం రోజున డెలివరీ..

police identified Rajkot game zone Co owner deceased in fire accident
రాజ్‌కోట్‌ గేమ్‌జోన్‌: మిస్సింగ్‌ అనుకున్నారు.. ప్రకాశ్‌ కూడా మృతి

గాంధీనగర్‌: రాజ్‌కోట్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో టీఆర్‌పీ గేమ్‌జోన్‌కు చెందిన ఒక సహ యజమాని మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. శనివారం టీఆర్‌పీ గేమ్‌జోన్‌లో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 28 మంది మృతి చెందారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి టీఆర్‌పీ గేమ్‌జోన్‌ ఓనర్లపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యజమానుల్లో ఒకరైన ప్రకాశ్‌ హిరాన్‌ అదే అగ్ని ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుంచి తన సోదరుడు కనిపించడం లేదని ప్రకాశ్‌ హిరాన్‌ సోదరుడు జితేంద్ర హిరాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ నంబర్లు కూడా స్వీచ్‌ ఆఫ్‌ వస్తున్నాయిని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలంలోనే ప్రకాశ్‌ కారు ఉన్నట్లు జితేంద్ర పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో ప్రకాశ్‌ ఉన్న దృశ్యాలు కనిపించాయి. దీంతో డీఎన్‌ఏ టెస్ట్‌ చేసిన అగ్ని ప్రమాదంలో మృతి చెందినవారిలో తన సోదరుడిని కనిపెట్టాలని జీతేంద్ర పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ప్రకాశ్‌ తల్లి డీఎన్‌ఏను తీసుకుని మృతదేహాలతో పోల్చి ప్రకాశ్‌ హిరాన్‌ మృతి చెందినట్లు ప్రకటించారు. టీఆర్‌పీ గేమ్‌జోన్‌లో ప్రకాశ్‌ హిరాన్‌ ప్రధానమైన షేర్‌ హోల్డర్‌గా ఉన్నారు. టీఆర్‌పీ గేమ్‌జోన్‌ను నిర్వహిస్తున్న ధావల్‌ ఠాకూర్‌తోపాటు మరో ఐదుగురిని గుజరాత్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అందులో రేస్‌వే ఎంటర్‌ప్రైజెస్‌ పార్ట్‌నర్లు యువరాజ​సింగ్‌, రాహుల్ రాథోడ్‌, టీఆర్‌పీ గేమ్‌ జోన్‌ మేనేజర్ నితిన్‌ జైన్‌ ఉన్నారు.

KTR Serious Comments Over Congress Govt
తెలంగాణలో ప్రభుత్వం ఉందా? లేదా?: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?.. లేదా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్పా? అని ప్రశ్నించారు.కాగా, కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా.. ‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..?విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు?పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ?ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది?ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప..ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా ?నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..!నేడు.. విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు..!పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి.. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి?సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు..ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా?తెల్లవారుజామున 4 గంటలకు లైన్‌లో నిలబడితే..సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా?గత పదేళ్లపాటు.. 10 నిమిషాల్లో అందిన విత్తనాలు..10 గంటలపాటు పడిగాపులు పడినా అందించలేరా?రంగారెడ్డి నుంచి.. కామారెడ్డి దాకా..రైతులకు ఏమిటీ కష్టాలు.. ఇంకెన్నిరోజులు ఈ కన్నీళ్లు..దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ.. అన్నదాతకే తిండితిప్పలు లేకుండా చేస్తారా ?బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్నిఅధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేస్తారా?ఇప్పటికైనా.. సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించండి..!బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా కళ్లెం వేయండి..!!కాంగ్రెస్ వచ్చింది.. కాటగలిసినం అంటున్న.. అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకండి..!!లేకపోతే.. రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని..కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదు..!!’ అని కామెంట్స్‌ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..?విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు ??పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ?ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది ??ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప..ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా ??నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు… pic.twitter.com/f22DOOMMDM— KTR (@KTRBRS) May 29, 2024

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement