‘మూసీ’కి పెరిగిన ఇన్‌ఫ్లో.. ఒక గేటు ఎత్తివేత

Nalgonda: 1 crest gates of Musi project lifted - Sakshi

కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో మంగళవారం అధికారులు ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని వదిలారు. హైదరాబాద్‌ నగరంతో పాటు మూసీ ఎగువ ప్రాంతాల్లో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు 892 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. మూసీ గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 644.10 అడుగులు ఉంది.

దీంతో అధికారులు ఒక క్రస్టు గేటును ఒక అడుగు మేర ఎత్తి 609 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆయకట్టులో పంటల సాగు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా 509 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.22 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top