గేట్‌ మధ్యలో నిలిచిన గూడ్స్‌ | train stoped middle of the gate | Sakshi
Sakshi News home page

గేట్‌ మధ్యలో నిలిచిన గూడ్స్‌

Sep 29 2016 10:14 PM | Updated on Sep 4 2017 3:31 PM

గేట్‌ మధ్యలో నిలిచిన గూడ్స్‌

గేట్‌ మధ్యలో నిలిచిన గూడ్స్‌

యాదగిరిగుట్ట: మండలంలోని వంగపల్లి రైల్వే గేట్‌ వద్ద ఓ గూడ్స్‌ రైలు సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో గేట్‌ గుండా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

యాదగిరిగుట్ట: మండలంలోని వంగపల్లి రైల్వే గేట్‌ వద్ద ఓ గూడ్స్‌ రైలు సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో గేట్‌ గుండా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు మధ్యాహ్నాం 2.55 గంటలకు వంగపల్లి స్టేషన్‌కు చేరుకునే క్రమంలో సాంకేతిక లోపంతో గేట్‌ మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో వరంగల్‌ జిల్లా నుంచి యాదాద్రికి వచ్చే వాహనాలన్నీ గేట్‌ వద్దే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరించి సాయంత్రం 5.30 గంటలకు రైలును అక్కడి నుంచి పంపించి వేశారు. దీంతో రాకపోకలు పునప్రారంభం అయ్యాయి.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement