గేట్ ఆన్‌లైన్ పరీక్షలు యథాతథం | gate online exams no change | Sakshi
Sakshi News home page

గేట్ ఆన్‌లైన్ పరీక్షలు యథాతథం

Feb 7 2015 4:15 AM | Updated on Sep 2 2017 8:54 PM

ఎంఈ, ఎంటెక్, నేరుగా పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజనీరింగ్ (గేట్) ఆన్‌లైన్ పరీక్షల్లో భాగంగా శని, ఆదివారాల్లో (ఈ నెల 7, 8 తేదీల్లో) జరగాల్సిన పరీక్షలను యథాతథంగా నిర్వహించనున్నట్లు కాన్పూర్ ఐఐటీ పేర్కొంది.

హైదరాబాద్: ఎంఈ, ఎంటెక్, నేరుగా పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజనీరింగ్ (గేట్) ఆన్‌లైన్ పరీక్షల్లో భాగంగా శని, ఆదివారాల్లో (ఈ నెల 7, 8 తేదీల్లో) జరగాల్సిన పరీక్షలను యథాతథంగా నిర్వహించనున్నట్లు కాన్పూర్ ఐఐటీ పేర్కొంది. ఈ మేరకు గేట్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. గేట్ పరీక్షల్లో భాగంగా గత నెల 31న, ఈ నెల 1నపరీక్షలను నిర్వహించింది.

అయితే నేడు, రేపు జరగాల్సిన ఆన్‌లైన్ పరీక్షలను వాయిదా వేయాలని వచ్చిన విజ్ఞప్తులపై ఎలాంటి వాయిదా వేయడం లేదని స్పష్టం చేసింది. అలాగే ఆదివారం జాయింట్ అడ్మిషన్ టెస్టు (జామ్)ను నిర్వహించేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్ చర్యలు చేపట్టింది. ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ (పీహెచ్‌డీ), డ్యుయల్ డిగ్రీ, ఎమ్మెస్సీ-ఎంఎస్(రీసెర్చ్) తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement