యమహా మోటార్ 70వ వార్షికోత్సవ వేడుక సందర్భంగా యమహా మోటార్ సంస్థ తన ఫ్లాగ్‌ప్ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ ఆర్15 సిరీస్ బైక్‌లపై రూ.5,000 డిస్కౌంట్ ప్రకటించింది. ప్రత్యేక తగ్గింపు ధరలు జనవరి 5 నుంచే అమల్లోకి వచ్చాయని కంపెనీ తెలిపింది. తగ్గింపు తర్వాత యమహా ఆర్15 సిరీస్‌లోని యమహా ఆర్15ఎస్ మోడల్ బైక్ ప్రారంభం ధర రూ.1,50,700గా ఉంది.
రేసింగ్ నుంచి ప్రేరణ పొందిన డిజైన్, ఆధునిక సాంకేతికత, రోజువారీ వినియోగానికి అనువైన రైడింగ్ లక్షణాల కారణంగా యువతలో ఈ బైక్‌లకు విశేషణ ఆదరణ లభించింది. భారత్‌లో ఇప్పటివరకు 10 లక్షలకుపైగా యూనిట్ల ఉత్పత్తి జరగడం ఆర్15 సిరీస్ బ్రాండ్ డిమాండ్ ప్రతిబింబిస్తుంది.
ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, క్విక్‌షిఫ్టర్, ఎల్‌ఈడీ లైటింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 155 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఆరు స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది. తగ్గించిన ధరలను పరిగణలోకి తీసుకుంటే ఇదే సిరీస్‌లోని ఆర్15 వీ4 బైక్ ధర రూ.1,66,200, ఆర్15 ఎం బైక్ ధర రూ.1,81,100గా ఉన్నాయి.


