బాహుబలి ఎక్స్‌కవేటర్‌ వచ్చేసింది! | JCB India at EXCON 2025 Largest Excavator Ever in India | Sakshi
Sakshi News home page

బాహుబలి ఎక్స్‌కవేటర్‌ వచ్చేసింది!

Dec 12 2025 2:45 PM | Updated on Dec 12 2025 4:12 PM

JCB India at EXCON 2025 Largest Excavator Ever in India

దక్షిణాసియాలోనే అతిపెద్ద నిర్మాణ పరికరాల ప్రదర్శన అయిన ఎక్స్‌కాన్‌-2025లో జేసీబీ ఇండియా చారిత్రక ఆవిష్కరణ చేసింది. భారత మౌలిక సదుపాయాలకు అనుగుణంగా 400 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన ఇంజిన్‌తో శక్తివంతమైన 52-టన్నుల జేసీబీ 520 ఎక్స్‌ఎల్‌ ఎక్స్‌కవేటర్‌ను ఆవిష్కరించింది. భారతదేశంలో తయారు చేసిన అత్యంత భారీ యంత్రంగా నిలిచిన ఈ ఎక్స్‌కవేటర్‌ దేశీయ భారీ నిర్మాణాల అవసరాలకు ఎంతో తోడ్పడుతుందని జేసీబీ తెలిపింది.

ఇది జాతీయ రహదారుల ప్రాజెక్టులు, విస్తృత మైనింగ్ కార్యకలాపాలు, పట్టణ విస్తరణలో అవసరాల కోసం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది. ఈ యంత్రం లాంచ్‌తో జేసీబీ హెవీ డ్యూటీ సెగ్మెంట్‌లోకి ప్రవేశించినట్టు స్పష్టమవుతోంది. ఇది భారత మౌలిక సదుపాయాల వృద్ధిని మరింత వేగవంతం చేయగలదని కంపెనీ చెప్పింది. ప్రపంచ ఎగుమతుల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు పేర్కొంది.

ఈ ప్రదర్శనలో జేసీబీ ఒక్క 520 ఎక్స్‌ఎల్‌ను మాత్రమే కాకుండా మొత్తం 10కి పైగా కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. ఈ ఉత్పత్తులన్నీ కస్టమర్ కేంద్రీకృత ఇన్నోవేషన్‌లుగా ఉంటాయని కంపెనీ చెప్పింది. ఎన్‌హాన్స్‌ బ్యాక్‌హో లోడర్లు, కొత్త 2-5 టన్నుల ఎక్స్‌కవేటర్‌ రేంజ్‌తో సహా ఈ మెషిన్లు లో మేనేజ్‌మెంట్‌ ఖర్చు, మెరుగైన ఇంధన సామర్థ్యంపై దృష్టి సారించినట్లు పేర్కొంది. గత 15 సంవత్సరాల్లో జేసీబీ తన యంత్రాల్లో 45% ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచినట్లు చెప్పింది.

హైడ్రోజన్ జెన్ సెట్ ఆవిష్కరణ

స్థిరమైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తూ జేసీబీ తన హైడ్రోజన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. 2023లో ప్రవేశపెట్టిన హైడ్రోజన్ బ్యాక్‌హో లోడర్ విజయవంతం అయిన తరువాత కంపెనీ ఇప్పుడు హైడ్రోజన్ ఎనర్జీతో నడిచే జెన్ సెట్‌ను ప్రకటించింది. ఈ ఆవిష్కరణ జీరో-కార్బన్ ఎమిషన్లతో స్వచ్ఛ ఇంధన పరిష్కారాలను అందిస్తుంది.

కస్టమర్ సపోర్ట్ బలోపేతం

డిజిటల్ పరివర్తనలో భాగంగా జేసీబీ అనేక కొత్త ప్లాట్‌ఫామ్‌లను ప్రవేశపెట్టింది. ‘పార్ట్స్ ఆన్‌లైన్’ పోర్టల్ ద్వారా ఈ-కామర్స్ తరహాలో విడి భాగాల కేటలాగ్‌ను అందిస్తూ, లావాదేవీలను వేగవంతం చేస్తుంది. నెక్స్ట్-జెన్ టెలిమాటిక్స్ వ్యవస్థ ద్వారా మెషిన్ కంటిషన్‌ను మెరుగుపరుస్తుంది. రియల్-టైమ్ ఆపరేషనల్ ఇన్‌సైట్స్ అందిస్తుంది.

నైపుణ్యాభివృద్ధికి సిమ్యులేటర్లు

శిక్షణా విభాగంలో జేసీబీ ‘దక్ష్’ ద్వారా సిమ్యులేటర్లను అందిస్తుంది. ఇది శిక్షణా ఖర్చులను తగ్గించడంతోపాటు భద్రతను పెంచుతుందని కంపెనీ తెలిపింది. 2026 ప్రారంభంలో ఎక్స్‌కవేటర్‌ సిమ్యులేటర్ కూడా విడుదల కానున్నట్లు పేర్కొంది. చిన్న కాంట్రాక్టర్లు ఈ సిమ్యులేటర్ల ద్వారా ఖరీదైన శిక్షణ లేకుండానే ఆపరేటర్ల నైపుణ్యాలను మెరుగుపరచవచ్చని చెప్పింది.

ఇదీ చదవండి: జీవిత బీమాపై అపోహలు తగ్గాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement