ఐఈఏ నివేదిక
ప్రపంచంలోనే 2035 నాటికి భారతదేశంలో అత్యధికంగా ఇంధన డిమాండ్ నెలకొంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) విడుదల చేసిన ‘వరల్డ్ ఎనర్జీ అవుట్‌లుక్ 2025’ నివేదిక వెల్లడించింది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, వేగవంతమైన పట్టణీకరణ, మధ్యతరగతి జనాభా పెరుగుదల కారణంగా దేశ ఇంధన డిమాండ్‌లో గణనీయమైన పెరుగుదల నమోదవుతుందని నివేదిక పేర్కొంది.
చమురు డిమాండ్‌లో కీలక పాత్ర
గత దశాబ్ద కాలంలో చమురు డిమాండ్ వృద్ధిలో చైనా 75% వాటాను కలిగి ఉండగా, ఈ పరిస్థితి మారుతోందని ఐఈఏ తెలిపింది. రాబోయే దశాబ్దంలో ప్రపంచ చమురు డిమాండ్ వృద్ధికి భారత్ నాయకత్వం వహిస్తుంది. ఇండియా చమురు వినియోగం 2024లో రోజుకు సగటున 5.5 డాలర్లుగా ఉండేది. 2035 నాటికి ఇది 8 డాలర్లకు పెరుగుతుందని అంచనా. కార్ల కొనుగోలు వేగంగా పెరగడం, ప్లాస్టిక్స్, రసాయనాలు, విమానయానానికి పెరుగుతున్న డిమాండ్ ఇందుకు కారణం.
వేగవంతమైన ఆర్థిక, విద్యుత్ వృద్ధి
2035 నాటికి భారతదేశంలో జీడీపీ సగటున 6.1% చొప్పున పెరుగుతుంది. ఇది ఇతర ప్రధాన దేశాల కంటే ఎక్కువ. 2035 నాటికి భారతదేశ తలసరి జీడీపీ ప్రస్తుత గణాంకాల కంటే 75% అధికంగా ఉంటుంది. గృహాల్లో ఎయిర్ కండీషనర్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల వాడకం పెరుగుతున్న కారణంగా విద్యుత్ డిమాండ్ 80% అధికమవుతుంది.
ఇదీ చదవండి: పేలుడు ఘటనల్లో సత్య శోధన


