2025 ముగుస్తోంది, 2026 రాబోతోంది. ఈ సమయంలో జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' తన మొత్తం ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
వచ్చే ఏడాది ప్రారంభం (జనవరి 1) నుంచే బెంజ్ కార్ల ధరలు 2 శాతం పెరగనున్నాయి. కరెన్సీ అస్థిరత, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిరంతర లాజిస్టికల్ సవాళ్లు మొదలైన కారణాల వల్ల.. ధరలు పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. యూరోతో పోలిస్తే భారత రూపాయి బలహీనమైన నేపథ్యంలో బీఎండబ్ల్యూ కూడా ఇలాంటి చర్య తీసుకుంది. ఇప్పుడు బెంజ్ కంపెనీ ఈ జాబితాలో చేరింది.
2026 జనవరి 1నుంచి 2 శాతం ధరలు పెరుగుతాయని కంపెనీ వెల్లడించింది. కానీ ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుందనే విషయాన్ని సంస్థ స్పష్టంగా వెల్లడించలేదు. మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో వివిధ రకాల బాడీ స్టైల్స్‌లో లగ్జరీ కార్లను విక్రయిస్తుంది. వీటిలో స్థానికంగా తయారు చేసినవి, స్థానికంగా అసెంబుల్ చేసినవి, కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) మోడల్‌లు ఉన్నాయి. అయితే కొత్త ధరలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: టెస్టింగ్ కోసం మిరాయ్: త్వరలో రానుందా?


