
ప్రముఖ వాహన తయారీ సంస్థ ''మినీ'' ఇప్పుడు భారతదేశంలో మినీ కూపర్ ధరలను తగ్గించింది. కేంద్రం కొత్తగా ప్రకటయించిన జీఎస్టీ 2.0 సంస్కరణ తరువాత కంపెనీ ధరలు వెల్లడించింది. సవరించిన కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులో ఉంటాయి.
మినీ కూపర్ ప్రస్తుతం భారతీయ విఫణిలో.. నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ఎసెన్షియల్, క్లాసిక్, ఫేవర్డ్, జేసీడబ్ల్యు. కంపెనీ ఇప్పుడు ఈ వేరియంట్స్ ధరలను రూ. 2.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు తగ్గించింది. ఇది కొత్త మినీ కార్ల కొనుగోలుదారులకు ప్రయోజనకారిగా ఉంటుంది.
తగ్గిన ధరలు
➤ఎసెన్షియల్: రూ. 2,50,000 తగ్గింది - (కొత్త ధర రూ. 43,70,000)
➤క్లాసిక్: రూ. 2,75,000 తగ్గింది - (కొత్త ధర రూ. 49,20,000)
➤ఫేవర్డ్: రూ. 3,00,000 తగ్గింది - (కొత్త ధర రూ. 52,00,000)
➤జేసీడబ్ల్యు: రూ. 3,00,000 తగ్గింది - (కొత్త ధర రూ. 54,50,000)
ఇదీ చదవండి: జీఎస్టీ ఎఫెక్ట్: రూ.2 లక్షలు తగ్గిన ఫేమస్ కారు ధర