
జీఎస్టీ సవరణల తరువాత దాదాపు అన్ని కంపెనీలు తగ్గిన తమ వాహనాల ధరలను ఇప్పటికే ప్రకటించాయి. కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ తరుణంలో లెక్సస్ ఇండియా కూడా.. తగ్గిన ధరలను వెల్లడిందింది.
లెక్సస్ ఇండియా దేశంలో విక్రయించే.. LX 500d ధర రూ.20.80 లక్షల వరకు తగ్గినట్లు పేర్కొంది(ఈ కారు అసలు ధర రూ. 2 కోట్ల కంటే ఎక్కువే). దేశంలో పండుగ సీజన్ ప్రారంభానికి ముందు తగ్గిన ఈ ధరలు అమ్మకాలను కూడా పెంచే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
లెక్సస్ ES 300h ఎక్స్‌క్విజిట్ హైబ్రిడ్ సెడాన్ ఇప్పుడు రూ.64 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లభించనుంది. దీని ధర రూ. 1.47 లక్షలు తగ్గింది. లెక్సస్ 350హెచ్, ఆర్ఎక్స్ 350హెచ్, ఆర్ఎక్స్ 500హెచ్, ఎల్ఎమ్ 350హెచ్, ఎల్ఎక్స్ 500డీ ధరలు కూడా చాలా వరకు తగ్గాయి.
ఇదీ చదవండి: 2025 నాటికి రెండు కోట్ల వాహనాలు: సీపీసీబీ అంచనా
దేశంలోని చాలా లెక్సస్ హైబ్రిడ్ మోడల్స్.. కొన్ని రాష్ట్రాల్లో తక్కువ రోడ్ పన్నుకు అర్హత పొందుతాయి. కాబట్టి ఆన్ రోడ్ ధరలు కూడా కొంత తగ్గుతాయి. హైబ్రిడ్ మోడళ్లను ఎంచుకునే కొనుగోలుదారులు రాష్ట్ర పన్నులు, రిజిస్ట్రేషన్ ఫీజులు, ప్రోత్సాహకాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు వాటి ప్రభావవంతమైన ఖర్చులు మరింత తగ్గుతాయని తెలుస్తోంది.