కేంద్ర కేబినెట్ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ కీలక ప్రకటన చేసింది. 'పూజ్య బాపు ఉపాధి హామీ పథకం'గా నామకరణం చేయడంతో పాటు.. పనిదినాలు ఏడాదికి 120 రోజులకు పెంచింది.
ఈ పథకాన్ని మొదట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 (NREGA) అని ప్రారంభించారు. తరువాత దీనిని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)గా మార్చారు. ఇప్పుడు 'పూజ్య బాపు ఉపాధి హామీ పథకం'గా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో.. నైపుణ్యం లేని పౌరులకు జీవనోపాధిని, ఆర్ధిక భద్రతను కల్పించడానికి కేంద్రం ఈ ఉపాధి హామీ పథకం ప్రారంభించింది. ఈ స్కీమ్ ప్రకారం.. ఇది వరకు ప్రతి ఇంటి నుంచి పని చేయడానికి సిద్ధంగా ఉన్న పెద్దలకు కనీసం 100 రోజుల ఉపాధి కల్పించారు. అయితే ఇప్పుడు పనిదినాలు 120 రోజులకు పెంచారు.
గ్రామీణ ప్రాంతాల్లో పనికి డిమాండ్ పెరిగినప్పుడు.. ఈ పథకం చాలామందికి ఉపాధి కల్పించింది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, ఇంటికి దగ్గరగా సంపాదించుకోవడానికి అవకాశం కల్పించడం వంటివి ఈ పథకం ద్వారానే సాధ్యమైంది. ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన & స్థిరమైన అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.
ఇదీ చదవండి: అప్పు కోసం బ్యాంకుకు వెళితే మొట్టమొదట చూసేదేమిటి?


