ఎయిరిండియా విమానంలో మంచు లక్ష్మి.. క్షేమం అంటూ పోస్ట్‌ | Manchu Lakshmi Travel London In Air India Flight | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానంలో మంచు లక్ష్మి.. క్షేమం అంటూ పోస్ట్‌

Jun 14 2025 7:51 AM | Updated on Jun 14 2025 9:45 AM

Manchu Lakshmi Travel London In Air India Flight

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయిన కొన్ని క్షణాలకే ఎయిరిండియా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. అయితే, తాజాగా సినీ నటి మంచు లక్ష్మి( Manchu Lakshmi ) సోషల్‌మీడియాలో ఒక పోస్ట్‌ చేసింది. ఎయిరిండియా విమానంలో తాను ప్రయాణించానని ఆమె చెప్పింది. చాలామంది తనకు ఏమైనా ప్రమాదం జరిగిందా అనే ఆందోళనతోనే కాల్స్‌ చేస్తున్నారని  పేర్కొంది. దీంతో ఆమె అసలు విషయాన్ని చెబుతూ ఒక వీడియోతో పాటు ఎక్స్‌ పేజీలో పోస్ట్‌ చేసింది.

'విమాన ప్రమాదం జరిగిన రోజే ఎయిరిండియా ఫ్లైట్‌లో నేను  ప్రయాణించిన మాట వాస్తవమే.. కానీ, నేను ముంబై నుంచి  లండన్‌ వెళ్లాను. అహ్మదాబాద్‌లో జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను లండన్‌ చేరిన వెంటనే ఈ వార్త తెలుసుకున్నాను. చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు, ఇది నిజంగా బాధాకరమైనది. ఈ విషాదంలో ఇంకా ఎక్కువ మంది రెసిడెంట్ డాక్టర్లు ప్రాణాలు కోల్పోయినట్లు విని నా గుండె పగిలిపోయింది. నేను ఈరోజు ఎయిర్ ఇండియాలో లండన్‌కు వెళ్లానని నమ్మలేకపోతున్నాను. ఈ రోజు ఊహించుకోవడానికి చాలా బాధాకరమైనది. మన ప్రాణాలు ఒక క్షణంలో ఎలా ముగిసిపోతాయి అనేది ఇదొక ఉదహారణ. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనమేంటో అర్థం అవుతుంది. బాధిత కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతి.' అని  మంచు లక్ష్మి తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement