'కింగ్డమ్‌' ట్విటర్‌ రివ్యూ.. అనకొండలా తిరిగొచ్చిన విజయ్‌ | Kingdom Twitter Review | Sakshi
Sakshi News home page

'కింగ్డమ్‌' ట్విటర్‌ రివ్యూ.. అనకొండలా తిరిగొచ్చిన విజయ్‌

Jul 31 2025 7:21 AM | Updated on Jul 31 2025 9:51 AM

Kingdom Twitter Review

రౌడీబాయ్విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం 'కింగ్డమ్‌' థియేటర్స్లోకి వచ్చేసింది. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ప్పటికే ఓవర్సీస్లలో సినిమా పూర్తి అయింది. దీంతో వారు ట్విటర్వంటి సోషల్మీడియాలలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సరైన విజయం కోసం విజయ్దేవరకొండ కొంతకాలంగా ఎదురుచూస్తున్న క్రమంలో గౌతమ్ తిన్ననూరి దర్శకుడితో సినిమా ప్రకటించాడు. వీరిద్దరి కాంబినేషన్హిట్అవుతుందని ఫ్యాన్స్భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించగా సత్యదేవ్‌ కీలకపాత్రలో నటించారు. సత్యదేవ్, విజయ్‌దే వరకొండ అన్నదమ్ముల పాత్రల్లో కనిపించారు. వారి బంధం ఎలా ఉందో నెటిజన్లు సోషల్మీడియాలో పంచుకున్నారు.

కింగ్‌డమ్ సినిమాకు ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. విజయ్‌ దేవరకొండ ఒక అనకొండలా తిరిగొచ్చాడని నెటిజన్లు కామెంట్స్చేస్తున్నారు. ఇదొక ఎమోషనల్ బ్లాక్‌బస్టర్ అంటూ.. అన్నదమ్ముల అనుబంధం గురించి అద్భుతంగా చూపించారని చెబుతున్నారు. విజయ్ దేవరకొండ, సత్య దేవ్ తమ నటనతో అదరగొట్టారని అంటున్నారు. సినిమా కోసం అనిరుధ్ సంగీతంతో ఫుల్డ్యూటీ చేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతమైన స్టోరీ లైన్తో తెరకెక్కిన చిత్రంలో అత్యుత్తమ నటన కనబరిచారని విజయ్ని అభినందిస్తున్నారు. టైర్‌-1 హీరోల లిస్ట్లోకి తెలంగాణోడు వచ్చేశాడని పేర్కొన్నారు.

కింగ్డమ్’ టైటిల్ కార్డ్ నుంచే మెప్పించేలా ఉందని ఫ్యాన్స్తో పాటు కామన్ప్రేక్షకులు కూడా చెబుతున్నారు. సినిమా ప్రారంభం కావడమే సీన్తో ఉంటుందని, ఆపై కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకుడు కథలో లీనమయ్యేలా దర్శకుడు ప్లాన్చేసుకున్నాడని అంటున్నారు. కథ విషయంలో ఎక్కడా కూడా పక్కదారి పట్టకుండా ఖచ్చితమైన స్టోరీ లైన్ మీదే డ్రామా నడిచిందన్నారు. మెత్తం మీద సినిమా బ్లాక్బస్టర్అంటూ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉందని ఎక్కువ పోస్టులు కనిపిస్తున్నాయి.

ఫస్టాప్ఎంత బలంగా ఉందో సెకండాఫ్ కూడా సూపర్ స్ట్రాంగ్గా ఉందని ఎక్కువ రివ్యూలు చెబుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంకలోని జైలు సీన్స్తో పాటు బోట్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన బలమంటున్నారు. బక్కోడు ఫుల్డ్యూటీ చేశాడంటూ అనిరుధ్బీజీఎమ్తో ప్రతి సీన్ను భారీగా ఎలివేట్చేశాడని చెప్పుకుంటున్నారు.

ఎక్కువగా పాజిటివ్‌ రివ్యూలే కానీ,..
కింగ్డమ్లో ఎక్కువ పాజిటివ్రివ్యూలే కనిపిస్తున్నాయి. అయితే, కొందరు మాత్రం కేజీఎఫ్‌, పుష్ప, బాహుబలి వంటి సీన్స్కింగ్డమ్లో గుర్తుకుచేస్తాయని చెబుతున్నారు. ఫస్టాప్లో చాలా బలంగా ఉందని అందుకు తగ్గట్టుగా సెకండాఫ్లేదని మరికొందరు అంటున్నారు. క్లైమాక్స్కాస్త నిరూత్సాహపరిచాడని కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. అక్కడక్కడా పెద్దగా భావోద్వేగ సీన్స్‌ మెప్పించలేకపోయాయని కొందరు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement