
రౌడీబాయ్ విజయ్ దేవరకొండ తన అభిమానులతో కొంత సమయం పాటు సరదాగ గడిపారు. తను నటించిన కొత్త సినిమా కింగ్డమ్ విడుదల సందర్భంగా వారందరినీ కలుసుకున్నారు. అందుకు వేదికగా హైదరాబాద్లోని సారథి స్టూడియో నిలిచింది. తమ అభిమాన హీరోను కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మీట్‌లో ఎక్కువమంది కాలేజీ విద్యార్థులే పాల్గొన్నారు. వాస్తవంగా ఆయన్ను యూత్ ఎక్కువగా ఇష్టపడుతారని తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ కూడా వారిని ఎంతమాత్రం నిరూత్సాహపరచలేదు. అక్కడికి వచ్చిన తన ఫ్యాన్స్ అందరితో ఫోటోలు దిగారు. వారందరూ కూర్చునేందుకు అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా.. చికెన్తో పాటు బగారా అన్నం రెడీ చేపించారు. తమ పట్ల విజయ్ చూపిన ప్రేమకు అభిమానులు ఫిదా అయ్యారు. నేడు (జులై 28) కింగ్డమ్ ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో జరగనుంది. సాయింత్రం 5గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున విజయ్ ఫ్యాన్స్ పాల్గొననున్నారు.
‘కింగ్‌డమ్’ చిత్రం జులై 31న పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో, స్పై పోలీస్ ఆఫీసర్‌గా సందడి చేయనున్నారట విజయ్.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ నటించిన ఏ సినిమా ఇప్పటి వరకూ రెండు భాగాలుగా రాలేదు. అలా వస్తున్న ఆయన మొదటి చిత్రం ‘కింగ్‌డమ్’ కానుండటం విశేషం. ఈ సినిమా రెండో భాగానికి ‘కింగ్‌డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్‌డమ్ 2’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.
ఫోటో షూట్ అయ్యాక ఫ్యాన్ కీ అన్నంపెట్టడం🫡👌🏻
అన్నదానం కీ మించింది ఏది లేదు🥹❤️
ఫుడ్ టెస్ట్ అదిరింది సూపర్ థాంక్స్ @TheDeverakonda అన్న❤️🫂#KingDom #VijayDeverakonda pic.twitter.com/LwCYRikqIn— MB Ramesh Nayak🦁 (@Mbramesh_4005) July 28, 2025