
బిగ్బాస్ ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. జీవితంలో ఒక్కసారైనా బిగ్బాస్ హౌస్కు వెళ్లాలన్న కల నేరవేర్చుకోవడమే కాదు.. ఏకంగా విన్నర్గా నిలిచాడు. రైతుబిడ్డగా హోస్లోకి ఎంట్రీ ఇచ్చి.. బిగ్బాస్ విజేతగా బయటికి తిరిగొచ్చాడు. జై జవాన్- జై కిసాన్ అంటూ బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ విజేతగా నిలిచాడు.
అయితే బిగ్బాస్ ట్రోఫీ గెలిచిన ఆనందం ప్రశాంత్కు కొద్దిగంటల్లోనే ఆవిరైంది. గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో షూటింగ్ వద్దకు పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్‌దీప్ అభిమానులు హంగామా సృష్టించారు. దీంతో బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్తో పాటు అతని తమ్ముడిపై కూడా కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన పల్లవి ప్రశాంత్ ఆరోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుని ఎమోషనలయ్యారు. పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. ఇంత బతుకు బతికి.. మా నాన్నను కోర్టు మెట్లు ఎక్కేలా చేశానని ఏడ్చేశారు. ఆ రోజు జరిగిన సంఘటన తలచుకుంటే నాకు ఇప్పటికీ బాధగానే ఉంటది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.