
విజయ్ దేవరకొండ వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ కింగ్‌డమ్. గౌతమ్ తిన్ననూరి డైరక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. తిరుపతి వేదికగా కింగ్‌డమ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఇక రిలీజ్‌కు మూడు రోజుల సమయం మాత్రమే ఉండడంతో హైదరాబాద్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు కింగ్‌డమ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు ఆడియన్స్‌ను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగులో మాట్లాడి అందిరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
అనిరుధ్ మాట్లాడుతూ..'ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన అభిమానులకు నా ధన్యవాదాలు. గత 12 ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్నారు. నన్ను మీ కొడుకులా చూసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను మీ వాడిని చేసుకున్నారు. మీరు నా వాళ్లు అయ్యారు. ఎప్పటికీ నేను మీ అనిరుధ్‌నే.. అలాగే మీ బక్కోడు..' అంటూ తెలుగులో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Once again Proved Telugu audience >>>> Any industry 🥵🥵🔥🔥#VijayDeverakomda #Kingdom #KingdomOnJuly31st pic.twitter.com/S6eUwfUqLq
— Srinivas (@srinivasrtfan) July 28, 2025