
హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్‌లో నటిస్తున్న తొలి హిందీ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. కార్తీక్ ఆర్యన్ , శ్రీలీల హీరో హీరోయిన్లుగా అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ ప్రేమకథ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఈ దీపావళికి విడుదల కావడం లేదని, వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని దర్శకుడు అనురాగ్ బసు వెల్లడించారు.
‘‘ఇప్పటి వరకు మా సినిమా చిత్రీకరణ 40 శాతం పూర్తయింది. కార్తీక్ ఆర్యన్ మా సినిమాతోపాటుగా మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో కార్తీక్ డిఫరెంట్ లుక్స్‌తో కనిపిస్తాడు. ఈ లుక్స్ పరంగా ఇబ్బందులున్నాయి. ఆగస్టు లేదా సెప్టెంబరులో మా సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభిస్తాం.
అయితే ‘సయారా’ సినిమా స్టోరీకి మా కథ దగ్గరగా ఉందని, దీంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేయాల్సి రావడం వల్లే ఈ ఏడాది మా చిత్రం రిలీజ్ కావడం లేదన్న వార్తల్లో నిజం లేదు. ‘సయారా’ కథకు, మా సిని మాకు సంబంధం లేదు’’ అన్నారు అనురాగ్ బసు. ఇలా శ్రీలీల తొలి హిందీ సినిమా రిలీజ్ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా కానుంది. ఇక ప్రస్తుతం తెలుగులో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, తమిళంలో ‘పరాశక్తి’ వంటి చిత్రాలతో శ్రీలీల బిజీగా ఉన్నారు.