
విదేశీ మీడియాలో తప్పుడు కథనాలొస్తున్నాయి
ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ఆగ్రహం
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో పైలెట్ల తప్పిదం కారణంగానే ఎయిర్‌ఇండియా విమానం కుప్పకూలిందంటూ అంతర్జాతీయ మీడియాలో తప్పుడు కథనాలు వెల్లువెత్తుతున్నాయని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. నిరాధార సమాచారంతో ప్రమాదఘటనపై ముందస్తు నిర్ణయానికి రావొద్దని విదేశీ మీడియాకు ఆయన హితవు పలికారు.
‘‘ అసంబద్ధ కథనాలు అల్లడం మానేయండి. ఈ కేసు సమగ్ర దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ప్రమాదానికి మూల కారణాలు, సిఫార్సులతో తుది నివేదిక రూ పొందిస్తాం. ఆలోపే అసమగ్ర సమాచారంతో ఎవ్వరూ ముందస్తు అంచనాకు, తుది నిర్ణయానికి రావొద్దు. తప్పుడు డేటాతో భారత విమానయాన రంగం భద్రతపై ప్ర యాణికుల్లో ఆందోళనను అనవసరంగా పెంచకండి’’ అని యుగంధర్ హితవు పలికారు.
వివాదమైన అమెరికా ‘క్రాష్’ నివేదిక
ఎయిరిండియా విమాన ప్రమాదంలో అమెరి కా క్రాష్ నివేదిక వివాదమైంది. కెప్టెన్ ఇంజిన్లకు ఇంధన ప్రవాహాన్ని తగ్గించాడని కాక్‌పిట్ రికార్డింగ్‌లను ఉదహరిస్తూ యూఎస్ ఇచ్చిన నివేదికను భారత పైలట్ల సమాఖ్య తోసిపుచ్చింది. అమెరికా అధికారుల అంచనా ను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ముందే నివేదిక వెల్లడించడంపై అనుమానం వ్యక్తం చేసింది. ప్రమాదం జరిగిన ఎయిరిండియా విమానానికి ఆరోజు 56 ఏళ్ల సుమీత్ సభర్వాల్ కెప్టెన్ హోదాలో నాయకత్వం వహించారు. ఆయనకు మొత్తం 15,638 గంటలపాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది.

32 ఏళ్ల మరో పైలట్ క్లైవ్ కుందర్ ఆరోజు ఫస్ట్ ఆఫీసర్ హోదాలో కో–పైలట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈయనకు మొత్తం 3,403 గంటలపాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత ఇంధన స్విచ్‌లు ‘కటాఫ్’ పొజిషన్‌లోకి మారడం చూసి కుందర్.. సుమీత్‌ను మీరెందుకు సిŠవ్చ్‌లను రణ నుంచి కటాఫ్‌లోకి మార్చారు? అని ప్రశ్నించారని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. అమెరికా ఉన్నతాధికారుల ద్వారా ఈ సమా చారాన్ని సేకరించామని వార్తాసంస్థ పేర్కొంది. స్విచ్‌లు కటాఫ్‌లోకి మారడంతో కుందర్ భయపడిపోయారని, కుందర్ ప్రశ్నించాక కూడా పైలట్ సుమీత్ ఎలాంటి భయం, ఆందోళనలేకుండా ప్రశాంతంగా కనిపించారని వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది.