బాధలో అహ్మదాబాద్‌ బాధితులు.. డీజే పార్టీ జోష్‌లో ఎయిర్‌ ఇండియా ఉద్యోగులు | Air India Office Members Party Video Went Viral On Social Media Days After Ahmedabad Plane Crash | Sakshi
Sakshi News home page

బాధలో అహ్మదాబాద్‌ బాధితులు.. డీజే పార్టీ జోష్‌లో ఎయిర్‌ ఇండియా ఉద్యోగులు

Jun 28 2025 8:09 AM | Updated on Jun 28 2025 9:17 AM

Air India Office Party Days After Plane Crash Video Viral

ఢిల్లీ: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా (Air India) విమానం కూలిపోయిన ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద ఘటన నుంచి మృతుల కుటుంబాలు, ప్రజలు తేరుకోక ముందే ఎయిర్‌ ఇండియా సంస్థకు చెందిన ఉద్యోగులు.. ఆఫీసులోనే పార్టీ చేసుకుని ఎంజాయ్‌ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంస్థ.. నలుగురు సీనియర్ల ఉద్యోగులపై వేటు వేసింది. ఉద్యోగులు పార్టీకి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. ఎయిర్‌ ఇండియా గ్రౌండ్‌ సేవల సిబ్బంది ఆఫీసులో పార్టీ చేసుకోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది. సింగపూర్‌ కేంద్రంగా పనిచేసే ఎస్‌ఏటీఎస్‌ లిమిటెడ్‌ (గతంలో సింగపూర్‌ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ సర్వీసెస్‌) ఎయిరిండియా భాగస్వామ్యంతో (AISATS) దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఫుడ్‌, బ్యాగేజ్‌ హ్యాండ్లింగ్‌ వంటి గ్రౌండ్‌ సేవలందిస్తోంది. అయితే, గుజరాత్‌లో విమాన దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకే.. గురుగ్రామ్‌లోని ఏఐఎస్‌ఏటీఎస్‌ కార్యాలయ సిబ్బంది ఓ పార్టీ చేసుకున్నారు. సిబ్బందితో కలిసి సీనియర్‌ ఉద్యోగులు కూడా డీజేకు స్టెప్పులు వేస్తూ డ్యాన్సులు చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

విమాన ప్రమాదం కారణంగా ఓ వైపు మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ఉద్యోగులు మాత్రం కనీన మానవత్వం లేదా? అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. ప్రయాణీకుల ప్రాణాలంటే అంత చులకనగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా సంస్థ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు సీనియర్‌ ఉద్యోగులను రాజీనామా చేయాలని ఆదేశించడంతోపాటు మిగతా వారిని హెచ్చరించినట్లు తెలిసింది. ఉద్యోగుల ప్రవర్తన మా విలువలకు అనుగుణంగా లేదు. బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం’ అని చెప్పుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement