
సమాజ్‌వాదీ పార్టీ , రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్‌పై హిమాచల్ ప్రదేశ్‌లోని మండికి చెందిన బీజేపీ ఎంపి కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని బచ్చన్ తోసేస్తున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో కంగనా ఆమెపై తీవ్ర విమర్శలు చేసింది.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో జయాబచ్చన్ వీడియోను షేర్ చేస్తూ ఇలా కాబెంట్ చేసింది. “అత్యంత చెడిపోయిన, విశేషాధికారం కలిగిన మహిళ” అని అంటూ విమర్శలు గుప్పించింది. అంతేకాదు భర్త అమితాబ్ బచ్చన్ మర్యాదను మంటగలుపుతోందంటూ వ్యాఖ్యానించింది.
“ఆమె అమితాబ్ బచ్చన్ భార్య కాబట్టి ప్రజలు ఆమె కోపతాపాలను/అర్ధంలేని తనాన్ని సహించారు. సమాజ్‌వాదీ పార్టి కోడిపుంజులా పందెంకోడిలా, ప్రవర్తింస్తోందంటూ ఎద్దేవా చేస్తే, ఎంత అవమానం, సిగ్గుచేటు” అని కంగనా మండిపడింది. ప్రస్తుతం కంగనా వ్యాఖ్యాలు నెట్టింట చర్చకు దారి తీశాయి. గతంలో జయాబచ్చన ఇలాంటి విమర్శలొచ్చిన సందర్భంలో కంగనా వెనకేసుకొచ్చింది. నిజం చెప్పాలంటే..ఆమె కోపిష్టిమనిషే కానీ అదే సమయంలో ఆమె గొప్ప వ్యక్తి అంటూ జయాను తెగ పొగిడేసింది. 1970లలో ఆమె సినీరంగంలో రాణించారని, సినీ పరిశ్రమలో అత్యంత గౌరవప్రదమైన మహిళల్లో ఒకరు అంటూ జయపై కంగనా ప్రశంసించింది.
(జయా బచ్చన్‌కు మళ్లీ కోపమొచ్చింది...సెల్ఫీ తీసుకోబోతే)
సెల్ఫీ కోసం ఆశతో వచ్చిన అభిమానిని తోసేసి ఏం చేస్తున్నావ్ (క్యా కర్ రహే హై ఆప్?) అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి పక్కకు నెట్టేశారు.దీంతో సదరు వ్యక్తి సారీ చేప్పారు. ఈ అనూహ్య పరిణామానికి అక్కడున్నవారంతా హతాశులైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్ హల్‌చల్ చేసింది. సింపుల్‌గా సెల్ఫీ వద్దు అంటే సరిపోయేది.. కానీ అతణ్ణి చేత్తో నెట్టివేయడం దారుణం అంటున్నారు. కొంతమంది యాటిట్యూడ్ అంటూ జయాబచ్చన్‌ను విమర్శించగా, మరి కొందరు జయ ప్రవర్తనను సమర్థించారు కూడా.