
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో విశ్వసనీయత, పారదర్శకత లోపించిదని ఆరోపిస్తూ దివంగత కెప్టెన్ సుమీత్ సభర్వాల్ తండ్రి పుష్కరాజ్ సభర్వాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 241 మంది ప్రయాణికులతో సహా 260 మంది మృతి చెందిన ఘటనపై న్యాయ నిపుణుల పర్యవేక్షణలో విచారణ జరగాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు.
పుష్కరాజ్ సభర్వాల్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్‌ఐపీ)అక్టోబర్ 10న సంయుక్తంగా దాఖలు చేసిన ఈ రిట్ పిటిషన్‌లో ఏఐ 171 ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు కోర్ట్ మానిటర్డ్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) నిర్వహించిన అన్ని ముందస్తు దర్యాప్తులను మూసివేసినట్లుగా పరిగణిస్తూ, స్వతంత్ర విమానయాన,సాంకేతిక నిపుణులు సభ్యులుగా ఉన్న రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని న్యాయ నిపుణుల కమిటీ పర్యవేక్షణలో విచారణ చేయాలని వారు కోరారు.
ప్రమాదంపై దర్యాప్తులో విశ్వసనీయత, పారదర్శకత లేకపోవడంపై పుష్కరాజ్ సభర్వాల్‌తో పాటు ఎఫ్‌ఐపీ సభ్యులు ఆవేదన చెందుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. బోయింగ్ 787 డిజైన్ స్థాయి లోపాలను పరిశోధించడంలో వైఫల్యం చెందారని, ఇంధన స్విచ్ కదలిక అంటూ పైలట్‌పై నింద మోపారని ఆరోపించారు. ఆరోగ్యం, మానసిక స్థితి లోపం అంటూ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ ప్రతిష్టను ప్రతిష్టను దెబ్బతీశారని పేర్కొన్నారు. జూలై 12 నాటి ఏఏఐబీ ప్రాథమిక నివేదిక లోపభూయిష్టంగా ఉందని పుష్కరాజ్ సభర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
తన కుమారుని మానసిక ఆరోగ్యం గురించి వచ్చిన కథనాలను తోసిపుచ్చుతూ పుష్కరాజ్ ఇలా అన్నారు. కెప్టెన్ సభర్వాల్ దాదాపు 15 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారని, కెప్టెన్ సభర్వాల్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడానికి కారణం గల కారణం అతని తల్లి మరణమని, ఆమె మూడేళ్ల క్రితం మృతిచెందారని పుష్కరాజ్ తెలిపారు. ఆ తర్వాత కెప్టెన్ సభర్వాల్ 100 కి పైగా విమానాలను ఎటువంటి ప్రమాదం లేకుండా నడిపారని, బోయింగ్ 787-8 విమానంలో 8,596 గంటలు సహా దాదాపు 15,638.22 గంటల విమాన ప్రయాణ అనుభవం కెప్టెన్ సుమీత్ సభర్వాల్‌కు ఉన్నదన్నారు.