170 మంది మావోయిస్టుల లొంగుబాటు: అమిత్‌ షా | A landmark day in our battle against Naxalism amit Shah | Sakshi
Sakshi News home page

170 మంది మావోయిస్టుల లొంగుబాటు: అమిత్‌ షా

Oct 16 2025 4:47 PM | Updated on Oct 16 2025 5:13 PM

A landmark day in our battle against Naxalism amit Shah
  • గత రెండ రోజుల్లో 258 మావోయిస్టులు వారు ఆయుధాలను విడిచిపెట్టినట్లు వెల్లడి

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో భారీ సంఖ్యలో మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెడుతున్నారని  హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ఈరోజు(గురువారం, అక్టోబర్‌ 16వ తేదీ) చత్తీస్‌గఢ్‌లో 170 మంంది మావోయిస్టులు లొంగిపోయిన విషయాన్ని ఆయన తెలిపారు. 

నిన్న (బుధవారం, అక్టోబర్‌ 15వ తేదీ)  27 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. గత రెండు రోజుల్లో చూస్తే 258 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు అమిత్‌ షా ప్రకటించారు.  నక్సలిజంపై పోరులో ఇదొక అరుదైన మైలురాయి అని అమిత్‌ షా స్పష్టం చేశారు. ఈ మేరకు తన ’ఎక్స్‌’ హ్యాండిల్‌లో మావోయిస్టులు లొంగుబాటు విషయాన్ని అమిత్‌ షా చెప్పుకొచ్చారు. 

భారత రాజ్యాంగంపై నమ్మకం ఉంచి హింసను త్యజించాలనే వారి నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను. ప్రధానమంత్రి నిరంతర ప్రయత్నాల కారణంగా నక్సలిజం తుది శ్వాస విడిచిందని విషయం దీని ద్వారా రుజువైంది

నక్సలిజాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం నాయకత్వం వహిస్తుంది. మా విధానం స్పష్టంగా ఉంది: లొంగిపోవాలనుకునే వారికి స్వాగతం,  తుపాకీని ప్రయోగించడం కొనసాగించే వారు మా దళాల ఆగ్రహానికి లోనుకాక తప్పదు. నక్సలిజం మార్గంలో ఇప్పటికీ ఉన్నవారు తమ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరాలని నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. 2026 మార్చి 31 లోపు నక్సలిజాన్ని నిర్మూలించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.

 

ఇదీ చదవండి:

న్యాయం కోసం సుప్రీంకోర్టుకు పైలెట్‌ తండ్రి..

 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement