
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో గత నెలలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన దరిమిలా, ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మర విచారణ జరుపుతున్నాయి. ఇదే కోవలో ఎయిర్ ఇండియా కూడా వ్యవస్థీకృత లోపాలపై పరిశీలన జరుపుతోంది. తాజాగా ఎయిర్ ఇండియా తమ బోయింగ్ 787-8 విమానాలలోని ఇంధన నియంత్రణ స్విచ్ (ఎఫ్‌సీఎస్) లాకింగ్ మెకానిజానికి సంబంధించిన ముందు జాగ్రత్త తనిఖీలను నిర్వహించింది.
ఈ నేపధ్యంలో ఇంధన నియత్రణ స్విచ్‌లతో ఎటువంటి సమస్యలు లేవని టాటా యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ అధికారులు స్పష్టం చేశారు. పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)బోయింగ్ విమాన నమూనాల ఎప్‌సీఎస్‌ను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన దరిమిలా ఎయిర్ ఇండియా ఈ తనిఖీలను నిర్వహించింది. బోయింగ్ నిర్వహణ షెడ్యూల్ ప్రకారం అన్ని బోయింగ్ 787-8 విమానాలలో పరిశీలనలు చేశారు.
తమ ఇంజనీరింగ్ బృందం ఎస్‌సీఎస్ లాకింగ్ మెకానిజంపై ముందు జాగ్రత్త తనిఖీలను పూర్తి చేసింది. వాటిలో ఎటువంటి సమస్యలు లేవని అధికారులు తెలిపారు. లాకింగ్ ఫీచర్‌తో సహా ఇంధన నియంత్రణ స్విచ్ డిజైన్ అన్ని బోయింగ్ విమాన నమూనాలలో ఒకే తరహాలోనే ఉంటుందని, అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8లో కూడా ఇదే తరహా స్విచ్ ఉందని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.
