Ahmedabad Plane Incident కో పైలట్‌కు కన్నీటి వీడ్కోలు.. | tears and a final goodbye to Air India Co pilot | Sakshi
Sakshi News home page

Ahmedabad Plane Incident కో పైలట్‌కు కన్నీటి వీడ్కోలు..

Jun 19 2025 5:43 PM | Updated on Jun 19 2025 6:15 PM

tears and a final goodbye to Air India Co pilot

బోరున విలపిస్తున్న క్లైవ్‌ కుందర్‌ తల్లి(ఫోటో- పీటీఐ)

ముంబై:  గతవారం అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన కో పైలట్‌ క్లైవ్‌ కుందర్‌కు అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు. ఈరోజు(గురువారం. జూన్‌ 19వ తేదీ) ఉదయం క్లైవ్‌ కుందర్‌ మృతదేహాన్ని ముంబైలోని అయన నివాసంలో ఉంచగా.. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ క్రమంలోనే క్లైవ్‌ కుందర్‌ తల్లి బోరున విలపించారు. తన కుమారుడిని ఇలా చూస్తానని ఊహించలేదని కుందర్‌ తల్లి శోకతప్త హృదయంతో విలపించారు. 

కుందర్‌ బంధువులు, స్నేహితులు నివాళులు అర్పించిన అనంతరం ఆయన భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం సేవిరి క్రైస్తవ స్మశానవాటికకు తరలించారు. ముంబైలోని గొరెగావ్‌ వెస్ట్‌లో తల్లి, దండ్రులు, ఒక సోదరితో కలిసి జీవిస్తున్న కుందర్‌కు 1, 100 గంటల పాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. 

జూన్‌ 12వ తేదీన అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్‌ ఇండియా విమానంలో క్లైవ్‌ కుందర్‌ ఫస్ట్‌ ఆఫీసర్‌, కో-పైలట్‌గా ఉన్నారు. అయతే విమానం టేకాఫ్‌ తీసుకున్న సెకన్ల వ్యవధిలో కూలిపోవడంతో మొత్తం విమానంలో ఉన్న పైలట్‌, కో పైలట్‌ తో సహా 241 మంది అసువులు బాసారు.  ఆ ప్రమాదం నుంచి ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడగా, మిగతా వారంతా ప్రాణాలు కోల్పోయారు. అయితే డీఎన్‌ఏ టెస్టులు పూర్తి చేసిన తర్వాత  మృతదేహాలను వారి వారి బంధువులు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలోనే మృతదేహాల గుర్తింపులో జాప్యం చోటు చేసుకుంటోంది. 

Advertisement
 
Advertisement
Advertisement